అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే

Posted by Srikanth on May 29th, 2010

అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే
ఇహ మెల్లగ మెల్లగ యదలోన చిరు గిల్లుడు షురువాయే
అరె చెక్కిలి గిలి గిలిగింతాయే ఈ తిక్కగాలి వలన
మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాతిరి దయ వలన.. ఆ..

బుగ్గే నిమురుకుంటే నాకు అరె మొటిమై తగులుతుంటడే
లేలేత నడుము లోని మడత తన ముద్దుకై వేచి వున్నదే
ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తలవారు కళ్ళలోన చిక్కుకున్నవే
మొత్తం నేల మీద మల్లెలన్ని తన నవ్వుల్లొ కుమ్మరిస్తడే

పేరే పలుకుతుంటే చాలు నా పెదవే తియ్యగవుతదే
తన చూపే తాకుతుంటే నన్ను అబ్బ నా మనసు పచ్చిగవుతదే
మెరిసే మెరుపల్లే వాడొస్తే అమ్మ నా గుండెలోన పిడుగు పడుతుంటదే
యదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక నా ఊపిరి ఆగిపోతదే

Movie :Khadgam

2 Responses to “అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే”

  1. Hi……..can u plz put up name of the movie ….along with song lyrics….sometimes i find hard to recollect the song…end up googling it…:)

  2. from arya i want all song lyrics