ఆవేశమంతా ఆలాపనేలే

Posted by Srikanth on September 1st, 2013

ఆవేశమంతా ఆలాపనేలే.. యద లయలో
ఆవేశమంతా ఆలాపనేలే.. ఉదయినిగా
నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జలించే స్వరాలా
ఆవేశమంతా ఆలాపనేలే

అలపైటలేసే సెలపాట విన్న
గిరివీణమీటే జలపాతమన్న
నాలోన సాగే ఆలాపన
రాగాలుతీసే ఆలోచన
జర్ధరతల నాట్యం.. అరవిరుల మరుల కావ్యం
ఎగసి ఎగసి నాలో గళ మధువులడిగె గానం
నిదురలేచె నాలో హౄదయమే..
ఆవేశమంతా ఆలాపనేలే.. యదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే…

వలకన్యలాడే తొలి మాసమన్నా
గోధూళి తెరలొ మలిసంజె కన్నా
అందాలు కరిగే ఆవేదన
నాదాల గుడిలో ఆరాధన
చిలిపి చినుకు చందం.. పురివిడిన నెమలి పింఛం
యదలు కదిపి నాలో.. విరిపొదలు వెతికె మోహం
బదులు లేని ఎదో పిలుపులా

ఆవేశమంతా ఆలాపనేలే.. యదలయలో
నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జలించే స్వరాలా
ఆవేశమంతా ఆలాపనేలే..

Movie :Alapana
Lyricist :Veturi
Singers :SP Balu
Music :Illayaraja

Comments are closed.