ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో

Posted by Srikanth on April 19th, 2010

Requested by Vamsi

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
యదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా… ఎదుట నిలిచింది చూడు

నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ
అవునో కాదో అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా… ఎదుట నిలిచింది చూడు

నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందో నా లేఖ
వినేవారు లేకా విసుక్కుంది నా కేక
నీదో కాదో రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమా
వరంలాంటి శాపమేదో సొంతమైందిలా…

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
యదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా… ఎదుట నిలిచింది చూడు

Movie :Vaana

Comments are closed.