ఏదోలా ఉందే నువ్వే లేక ఏమిబాలేదే నువ్వెళ్ళాక

Posted by Srikanth on December 22nd, 2009

ఓ నో నో నో నో నో నో…… ఓ నో నో నో నో నో నో
ఏదోలా ఉందే నువ్వే లేక ఏమిబాలేదే నువ్వెళ్ళాక
ఏంచెయ్యాలో పాలుపోక ఉన్నా నీ కల్లో నిదర్రాక
ఓ నో నో నో నో నో నో… నువ్వే నా సంతోషం గిల్లావే నా ప్రాణం
ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్ (2)

మిల మిల మిల మిల మెరుపుల తార
కలలకు కళ కళ చిలికిన తార
తళ తళ తళ తళ తళుకుల తార
గల గల నగవుల చిలిపి సితార
ఏమంటే ఎందుకంటే కారణాలే లేవంట
నాకంటే ఇష్టమంట నువ్వంటా
నా కంటిముందే ఉంటే చాలనుకున్నా
నువు దూరమైతే ఏదో అయిపోతున్నా
ఓ నో నో నో నో నో నో… నువ్వే నా సంతోషం గిల్లావే నా ప్రాణం
ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్ (2)
ఏదోలా ఉందే నువ్వే లేక ఏమిబాలేదే నువ్వెళ్ళాక

నిగ నిగ సొగసులు కురిసిన తార
చనువుగ మనసును తడిపిన తార
తలపుల తలుపును కదిపిన తార
యదసడి పలికిన వలపు సితార
తేదీలే మారుతున్నా నిన్నలో నేఉన్నానే
మనసంతా నింపుకున్నా నీతోనే
నువు దూరమయ్యే మాటెంతో చేదైనా
ఓ నింగితార నువ్వుండాలే పైనా
ఓ నో నో నో నో నో నో… నువ్వే నా సంతోషం గిల్లావే నా ప్రాణం
ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్ (2)
ఏదోలా ఉందే నువ్వే లేక ఏమిబాలేదే నువ్వెళ్ళాక
ఏంచెయ్యాలో పాలుపోక ఉన్నా నీ కల్లో నిదర్రాక
ఓ నో నో నో నో నో నో…… ఓ నో నో నో నో నో నో

Requested by Arpitha

Movie :Nenite

One Response to “ఏదోలా ఉందే నువ్వే లేక ఏమిబాలేదే నువ్వెళ్ళాక”

  1. Hey thanks for the song,,,,gud work….