ఏరారోయ్ సూర్యున్ని జాబిలి వాటేసుకుంది

Posted by Srikanth on September 30th, 2010

ఏరారోయ్ సూర్యున్ని జాబిలి వాటేసుకుంది
ఏరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది
ఏరారోయ్ సూర్యున్ని జాబిలి వాటేసుకుంది
ఏరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది
తాగినోళ్ళ తందనాలు వాగకుంటే వందనాలు
తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారు
ఏరారోయ్ సూర్యున్ని జాబిలి వాటేసుకుంది
ఏరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది

ఓరరెరె.. పల్లవొచ్చె నా గొంతులో ఎల్లువొచ్చె నా గుండెలో
పుట్టుకొచ్చె ఎన్నెన్ని రాగాలో
మందు కొట్టి ఒళ్ళెందుకు చిందులేసే తుళ్ళింతలో
కైపులోన ఎన్నెన్ని కావ్యాలో
రేపన్నదే లేదని ఉమరు కయ్యాము అన్నాడురా
నేడన్నదే నీదని ధూళిపాటి చలమయ్య చెప్పాడురా
రసవీరా కసితీరా నీరింటి చేపల్లె
గాలింటి గువ్వల్లె నే తేలిపోతాను
ఏరారోయ్ సూర్యున్ని జాబిలి వాటేసుకుంది
ఏరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది

దేవదాసు తాగాడురా వేదమేదో చెప్పాడురా
విశ్వదాభి రాముడ్ని నేనేరోయ్
ఒంటికేమో ఈడొచ్చెరా ఇంటికొస్తే తోడేదిరా
పుత్తడంటి పూర్ణమ్మ యాడుందో
శృంగార శ్రీనాధుడు ఎన్నెన్నో సీసాలు చెప్పాడురా
సంసార స్త్రీనాధుడై ఎన్నెన్నో వ్యాసాలు రాస్తానురా
ప్రియురాలా జవరాలా నీ చేప కన్నల్లె
నీ కంటిపాపల్లె నేనుండిపొతాలే

ఏరారోయ్ సూర్యున్ని జాబిలి వాటేసుకుంది
ఏరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది
తాగినోళ్ళ తందనాలు వాగకుంటే వందనాలు
తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారు
ఏరారోయ్ సూర్యున్ని జాబిలి వాటేసుకుంది
ఏరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది ఏరారోయ్..

EraarOy sooryUnni jaabili vaaTEsukundi
EraarOy mEghaanni merupocchi kaaTEsukundi
EraarOy sooryUnni jaabili vaaTEsukundi
EraarOy mEghaanni merupocchi kaaTEsukundi
taaginOLLa tandanaalu vaagakunTE vandanaalu
taitakkalaaDETi rEchukkanE choosi kaipekkipOtaaru
EraarOy sooryUnni jaabili vaaTEsukundi
EraarOy mEghaanni merupocchi kaaTEsukundi

Orarere.. pallavocche naa gontulO elluvocche naa gunDelO
puTTukocche ennenni raagaalO
mandu koTTi oLLenduku chindulEsE tuLLintalO
kaipulOna ennenni kaavyaalO
rEpannadE lEdani umaru kayyaamu annaaDuraa
nEDannadE needani dhooLipaaTi chalamayya cheppaaDuraa
rasaveeraa kasiteeraa neerinTi chEpalle
gaalinTi guvvalle nE tElipOtaanu
EraarOy sooryUnni jaabili vaaTEsukundi
EraarOy mEghaanni merupocchi kaaTEsukundi

dEvadaasu taagaaDuraa vEdamEdO cheppaaDuraa
viSwadaabhi raamuDni nEnErOy
onTikEmO eeDoccheraa inTikostE tODEdiraa
puttaDanTi poorNamma yaaDundO
SRngaara SreenaadhuDu ennennO seesaalu cheppaaDuraa
samsaara streenaadhuDai ennennO vyaasaalu raastaanuraa
priyuraalaa javaraalaa nee chEpa kannalle
nee kanTipaapalle nEnunDipotaalE

EraarOy sooryUnni jaabili vaaTEsukundi
EraarOy mEghaanni merupocchi kaaTEsukundi
taaginOLLa tandanaalu vaagakunTE vandanaalu
taitakkalaaDETi rEchukkanE choosi kaipekkipOtaaru
EraarOy sooryUnni jaabili vaaTEsukundi
EraarOy mEghaanni merupocchi kaaTEsukundi EraarOy..

Comments are closed.