ఓకె అనేసా దేఖో నా భరోసా

Posted by Srikanth on March 4th, 2011

ఓకె అనేసా దేఖో నా భరోసా
నీకే వదిలేసా నాకెందుకులే రభసా(2)
భారమంతా నేను మోస్తా అల్లుకో ఆశాలతా
చేరదీస్తా సేవచేస్తా రాణిలా చూస్తా
అందుకేగా గుండెలో నీ పేరు రాసా
తెలివనుకో తెగువనుకో మగజన్మకలా
కధ మొదలనుకో తుదివరకు నిలబడగలదా
ఓకె అనేసా దేఖో నా భరోసా
నీకే వదిలేసా నాకెందుకులే రభసా (2)

పరిగెడదాం పదవె చెలి… ఎందాక అన్నానా
కనిపెడదాం తుదిమజిలి… ఎక్కడున్నా
ఎగిరెలదాం ఇలనొదిలి… నిన్నాగమన్నానా
గెలవగలం గగనాన్ని… ఎవరాపినా
మరోసారి అను ఆ మాట మహారాజునై పోతాగా
ప్రతి నిమిషం నీకోసం ప్రాణం సైతం పందెం వేసేస్తా
పాత రుణమో కొత్త వరమో చెంగుముడి వేసిందిలా
చిలిపితనమో చెలిమి గుణమో ఏమిటి లీల
స్వప్న లోకం ఏలుకుందాం రాగమాలా
అదిగదిగో మదికెదురై కనబడలేదా
కధ మొదలనుకో తుది వరకు నిలబడగలదా

పిలిచినదా చిలిపి కలా… వింటూనే వచ్చేసా
తరిమినదా చెలియనిలా… పరుగు తీసా
వదిలినదా బిడియమిలా… ప్రశ్నల్ని చెరిపేసా
ఎదురవదా చిక్కువలా… ఎటో చూసా
భలేగుందిలే నీ ధీమా ఫలిస్తుందిలే ఈ ప్రేమా
అదరకుమా బెదరకుమా పరదా విడిరా సరదా పడదామా
పక్కనుంటే పక్కుమంటూ నవ్వి రారా ప్రియతమా
చిక్కులుంటే బిక్కుమంటూ లెక్కచేస్తామా
చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా
మమతనుకో మగతనుకో మతిచెడిపోదా
కధ మొదలనుకో తుది వరకు నిలబడగలదా

Movie :Kottabangarulokam
Lyricist :Sirivennela
Singers :Naresh Iyer, Kalyani
Music :Mickey J Meyer

Comments are closed.