కన్నులు రెండు కలవర పడుతుంటే

Posted by Srikanth on December 26th, 2009

కన్నులు రెండు కలవర పడుతుంటే
గుండెల సవ్వడి గుసగుసమంటుంటే
నాలో ప్రతి ఆశ నాలో ప్రతి శ్వాస
నాలో ప్రతి ఆశ నువ్వే కావాలంటే
రోజు కనుపాప నిన్నే చూడాలంటే
ప్రేమేనంటావా…. ప్రేమేనంటావా…..(2)

ఏ గాలి తిమ్మెర వస్తున్నా పరిమళాల స్వరాలుగా ఆ రాక నీదే అంటున్నా
ఏ పాట పల్లవి వింటున్నా పరవశాన చటుక్కునా ఆ పాట నీదే అంటున్నా
ఏమైనదేమో నాలోన యద లోనా గోదారి గాని పొంగేనా
ఈరోజే నేను వింటున్నా మది ఆలాపించే ప్రేమ కీర్తన
కన్నులు రెండు కలవర పడుతుంటే
గుండెల సవ్వడి గుసగుసమంటుంటే

నీ వెంట నీడై వస్తున్నా పరిచయాలు వరాలుగా నీ తీపి కలలే కంటున్నా
ఏ రోజు ఏ పని చేస్తున్నా ఆ క్షణాలు యుగాలుగా నీ ఊహలోనే ఉంటున్నా
ఈ మాయ అంతా నీదేనా తొలిప్రేమేనా నీలోన కూడ ఇంతేనా
ఈ హాయి అంతా ప్రేమేనా మహ బాగుందయ్యా మూగ వేదన
కన్నులు రెండు కలవర పడుతుంటే
గుండెల సవ్వడి గుసగుసమంటుంటే
నాలో ప్రతి ఆశ నాలో ప్రతి శ్వాస
నాలో ప్రతి ఆశ నువ్వే కావాలంటే
రోజు కనుపాప నిన్నే చూడాలంటే
ప్రేమేనంటావా…. ప్రేమేనంటావా…..(2)

Submitted by Sri Sravani

Movie :10th Class

Comments are closed.