చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా అరె ఆర్మ్ స్ట్రాంగా

Posted by Srikanth on January 30th, 2010

చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా
చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా అరె ఆర్మ్ స్ట్రాంగా
చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా
కలల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం
కలల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం (2)
చందురుని తాకినది నీవేగా అరె నీవేగా
వెన్నెలని దోచినది నీవేగా అరె నీవేగా
వయసు వాకిలిని తెరిచే వయ్యరం నీ కలల మందారం శృతిలయల శృంగారం

ఓ.. పువ్వులాంటి చెలి ఒడిలో పుట్టుకొచ్చె సరిగమలే (2)
పైటచాటు పున్నమిలా పొంగే మధురిమలే
ఓ.. తలపుల వెల్లువలో తలగడ అదుముకున్నా
తనువుని పొదువుకొని ప్రియునే కలుసుకున్నా
తాపాల పందిరిలో దీపమల్లే వెలుగుతున్నా
మగసిరి పిలుపులతో తేనెలాగా మారుతున్నా
కోరికల కోవెలలో కర్పూరమవుతున్నా
చందురునీ…. చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా అరె ఆర్మ్ స్ట్రాంగా
చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా
కలల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం (2)

రమ్మనే పిలుపు విని రేగుతోంది యవ్వనమే
ఏకమై పోదమంటూ జల్లుతుంది చందనమే
నీటిలోన చేప పిల్ల నీటికి భారమవునా
కోరుకున్న ప్రియసఖుడు కౌగిలికి భారమవునా
చెంత చేరి వచ్చినానే చెయ్యిజారి పోకే పిల్లా
పిల్లగాడి అల్లరిని ఓపలేదు కన్నెపిల్ల
ఓ.. అలిగిన మగతనమే పగపడితే వీడదు
చందురునీ…. చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా
చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా
కలల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం (2)

chanduruni taakinadi aarm sTraangaa
chanduruni taakinadi aarm sTraangaa are aarm sTraangaa
chekkilini dOchinadi nEnEgaa are nEnEgaa
kalala dEvataki pedavi taamboolam immandi SRngaaram
kalala dEvataki pedavi taamboolam immandi SRngaaram (2)
chanduruni taakinadi neevEgaa are neevEgaa
vennelani dOchinadi neevEgaa are neevEgaa
vayasu vaakilini terichE vayyaram nee kalala mandaaram SRtilayala SRngaaram

O.. puvvulaanTi cheli oDilO puTTukocche sarigamalE (2)
paiTachaaTu punnamilaa pongE madhurimalE
O.. talapula velluvalO talagaDa adumukunnaa
tanuvuni poduvukoni priyunE kalusukunnaa
taapaala pandirilO deepamallE velugutunnaa
magasiri pilupulatO tEnelaagaa maarutunnaa
kOrikala kOvelalO karpooramavutunnaa
chandurunee…. chanduruni taakinadi aarm sTraangaa are aarm sTraangaa
chekkilini dOchinadi nEnEgaa are nEnEgaa
kalala dEvataki pedavi taamboolam immandi SRngaaram (2)

rammanE pilupu vini rEgutOndi yavvanamE
Ekamai pOdamanTU jallutundi chandanamE
neeTilOna chEpa pilla neeTiki bhaaramavunaa
kOrukunna priyasakhuDu kougiliki bhaaramavunaa
chenta chEri vacchinaanE cheyyijaari pOkE pillaa
pillagaaDi allarini OpalEdu kannepilla
O.. aligina magatanamE pagapaDitE veeDadu
chandurunee…. chanduruni taakinadi aarm sTraangaa
chekkilini dOchinadi nEnEgaa are nEnEgaa
kalala dEvataki pedavi taamboolam immandi SRngaaram (2)

Movie :Rakshakudu

Comments are closed.