చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే

Posted by Srikanth on April 22nd, 2010

చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే
చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణువూదెనే మేఘం మురిసిపాడెనే
కరుకైన గుండెలో చిరుజల్లు కురిసెలే
తనవారి పిలుపుతో ఆశలు వెల్లువాయెనే ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనే
చినుకు రాక చూసి మది చిందులేసెనే
చిలిపి తాళమేసి చెలరేగిపోయెనే
చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణువూదెనే మేఘం మురిసిపాడెనే

తుళ్ళుతున్న చిన్ని సెలయేరు గుండెలోన పొంగి పొలమారు
అల్లుకున్న ఈ బంధమంతా వేకువైనదీ లోగిలంతా
పట్టెడన్నమిచ్చి పులకించే నేలతల్లి వంటి మనసల్లే
కొందరికే హృదయముంది నీ కొరకే లోకముంది
నీకు తోడు ఎవరంటు లేరు గతములో
నేడు చెలిమి చెయి చాపే వారే బతుకులో
కలిసిన బంధం.. కరిగిపోదులే
మురళి మోగే దివిని తావి కలిసిన వేళ..
చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణువూదెనే మేఘం మురిసిపాడెనే

మనసున వింత ఆకాశం మెరుపులు చిందే మనకోసం
తారలకే తళుకు బెళుకా ప్రతి మలుపు ఎవరికెరుక
విరిసిన ప్రతి పూతోట కోవెల ఒడి చేరేలా రుణమేదో మిగిలి ఉంది
ఆ తపనే తరుముతోంది
రోజు ఊయలై ఊగే రాగం గొంతులో
ఏవో పదములే పాడే మొహం గుండెలో
ఏనాడు తోడు లేకనే కడలి ఒడిని చేరుకొన్న గోదారల్లే
కరుకైన గుండెలో చిరుజల్లు కురిసెలే
తనవారి పిలుపుతో ఆశలు వెల్లువాయెనే ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనే
చినుకు రాక చూసి మది చిందులేసెనే
చిలిపి తాళమేసి చెలరేగిపోయెనే

chirugaali veechenE chiguraaSa rEpenE
chirugaali veechenE chiguraaSa rEpenE
veduranTi manasulO raagam vENuvoodenE mEgham murisipaaDenE
karukaina gunDelO chirujallu kuriselE
tanavaari piluputO aaSalu velluvaayenE oohalu UyaloopenE
aaSalu velluvaayanE oohalu UyaloopenE
chinuku raaka choosi madi chindulEsenE
chilipi taaLamEsi chelarEgipOyenE
chirugaali veechenE chiguraaSa rEpenE
veduranTi manasulO raagam vENuvoodenE mEgham murisipaaDenE

tuLLutunna chinni selayEru gunDelOna pongi polamaaru
allukunna ee bandhamantaa vEkuvainadI lOgilantaa
paTTeDannamicchi pulakinchE nElatalli vanTi manasallE
kondarikE hRdayamundi nee korakE lOkamundi
neeku tODu evaranTu lEru gatamulO
nEDu chelimi cheyi chaapE vaarE batukulO
kalisina bandham.. karigipOdulE
muraLi mOgE divini taavi kalisina vELa..
chirugaali veechenE chiguraaSa rEpenE
veduranTi manasulO raagam vENuvoodenE mEgham murisipaaDenE

manasuna vinta aakaaSam merupulu chindE manakOsam
taaralakE taLuku beLukaa prati malupu evarikeruka
virisina prati pootOTa kOvela oDi chErElaa ruNamEdO migili undi
aa tapanE tarumutOndi
rOju ooyalai oogE raagam gontulO
EvO padamulE paaDE moham gunDelO
EnaaDu tODu lEkanE kaDali oDini chErukonna gOdaarallE
karukaina gunDelO chirujallu kuriselE
tanavaari piluputO aaSalu velluvaayenE oohalu UyaloopenE
aaSalu velluvaayanE oohalu UyaloopenE
chinuku raaka choosi madi chindulEsenE
chilipi taaLamEsi chelarEgipOyenE

Movie :Shivaputrudu

Comments are closed.