చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా.. నిన్నే ఆపేదెలా..

Posted by Srikanth on August 25th, 2011

చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా.. నిన్నే ఆపేదెలా..
చివరికి నువ్వే అలా.. వేస్తావే వలా.. నీతో వేగేదెలా..
ఓ ప్రేమా.. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కలా..
కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది ఆ పై చేదెక్కుతోందిలా..
కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా..
చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా.. నిన్నే ఆపేదెలా..
చివరికి నువ్వే అలా.. వేస్తావే వలా.. నీతో వేగేదెలా..

నిప్పే ఇలా చేరగా మాటే మార్చి మాయే చెయ్యాలా
నన్నే ఇక నన్నుగా ప్రేమించని ప్రేమేలా
ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండాలా
నన్నింతగా ఊరించేస్తూ అల్లేస్తోందే నీ సంకెలా
కొంచెం మధురము కొంచెం విరహము ఇంతలో నువ్వు నరకం
కొంచెం స్వర్గము కొంచెం శాంతము గొంతులో జారు గరళము
కొంచెం పరువము కొంచెం ప్రళయము గుండెనే కోయు గాయము
కొంచెం మౌనము కొంచెం గానము ఎందుకీ ఇంధ్రజాలము

ఇన్నాళ్ళుగా సాగినా ప్రేమ నుంచి వేరైపోతున్నా
మళ్ళీ మరో గుండెతో స్నేహం కోరి వెళుతున్నా
ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా
ఒకో క్షణం ఆ సంతోషం నాతోపాటు సాగేదెలా ఎలా
చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా.. నిన్నే ఆపేదెలా..
చివరికి నువ్వే అలా.. వేస్తావే వలా.. నీతో వేగేదెలా..
ఓ ప్రేమా.. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కలా..
కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది ఆ పై చేదెక్కుతోందిలా..
కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా..

chilipiga choostaavalaa.. penavEstaavilaa.. ninnE aapEdelaa..
chivariki nuvvE alaa.. vEstaavE valaa.. neetO vEgEdelaa..
O prEmaa.. kannullO vaalE rOju entO baagunna nee kalaa..
konnaaLLE andamgaa UristOndi aa pai chEdekkutOndilaa..
kaDadaakaa prEminchE daarEdO pOlchEdelaa..
chilipiga choostaavalaa.. penavEstaavilaa.. ninnE aapEdelaa..
chivariki nuvvE alaa.. vEstaavE valaa.. neetO vEgEdelaa..

nippE ilaa chEragaa maaTE maarchi maayE cheyyaalaa
nannE ika nannugaa prEminchani prEmElaa
UpirE aagEdaakaa EdO oka tODunDaalaa
nannintagaa UrinchEstU allEstOndE nee sankelaa
konchem madhuramu konchem virahamu intalO nuvvu narakam
konchem swargamu konchem Saantamu gontulO jaaru garaLamu
konchem paruvamu konchem praLayamu gunDenE kOyu gaayamu
konchem mounamu konchem gaanamu endukI indhrajaalamu

innaaLLugaa saaginaa prEma nunchi vEraipOtunnaa
maLLI marO gunDetO snEham kOri veLutunnaa
prEmanE daaham teerchE saayam kOsam vEchaanilaa
okO kshaNam aa santOsham naatOpaaTu saagEdelaa elaa
chilipiga choostaavalaa.. penavEstaavilaa.. ninnE aapEdelaa..
chivariki nuvvE alaa.. vEstaavE valaa.. neetO vEgEdelaa..
O prEmaa.. kannullO vaalE rOju entO baagunna nee kalaa..
konnaaLLE andamgaa UristOndi aa pai chEdekkutOndilaa..
kaDadaakaa prEminchE daarEdO pOlchEdelaa..

Movie :Orange
Lyricist :Vanamali
Singers :Karthik
Music :Harris Jayaraj

Comments are closed.