చుక్కలారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ

Posted by Srikanth on June 5th, 2011

Lyric submitted by Manohar Oruganti

చుక్కలారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండీ దారికీ
వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ
విన్నవించరా వెండి మింటికీ
జో జో లాలీ జో జో లాలీ

మలి సంధ్య వేళాయే చలి గాలి వేణువాయే నిదురమ్మా ఎటు పోతివే
మునిమాపు వేళాయే కను పాప నిన్ను కోరె కునుకమ్మా ఇటు చేరవే
నిదురమ్మా ఎటు పోతివే కునుకమ్మా ఇటు చేరవే
నిదురమ్మా ఎటు పోతివే కునుకమ్మా ఇటు చేరవే
గోధూళి వేళాయే గూళ్ళని కనులాయే
గోధూళి వేళాయే గూళ్ళని కనులాయే
గువ్వల రెక్కల పైనా రివ్వు రివ్వున రావే
జోల పాడవా వేల కళ్ళకి
వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ
జో జో లాలీ జో జో లాలీ – 2

Movie :Apadbaandhavudu
Lyricist :Sirivennela Seetaarama Sastry
Singers :Chitra
Music :M M Keeravani

Comments are closed.