చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా

Posted by Srikanth on October 29th, 2011

Karthik rocks again with Sirivennela’s
beautiful lyric!

చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా
ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా
ఇన్నాళ్ళు నాకే తెలియని ఇన్నాళ్ళూ నాకే తెలియని
నన్ను నేనే నీలో చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా…

పచ్చని మాగాణి చేలు పట్టుచీరగా కట్టి
బంగరు ఉదయాల సిరులు నొసట బాసికంగా చుట్టి
ముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్ది
పున్నమి పదహారు కళలు సిగలో పువ్వులుగా పెట్టి
దేవేరిగా పాదం పెడతానంటూ
నాకు శ్రీవారిగా పట్టం కడతానంటూ
నవ నిధులు వధువై వస్తుంటే
సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే నేనైనట్టూ
చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా

నువ్వు సేవిస్తుంటే నేను సార్వభౌముడై పోతాను
నువ్వు తోడై ఉంటే సాగరాలు దాటేస్తాను
నీ సౌందర్యంతో ఇంధ్ర పదవినెదిరిస్తాను
నీ సాన్నిత్యంలో నేను స్వర్గమంటే ఏదంటాను
ఏళ్ళే వచ్చీ వయసును మళ్ళిస్తుంటే
నే నీ ఒళ్ళో పాపగ చిగురిస్తుంటే చూస్తున్నా…
చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా
ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా
ఇన్నాళ్ళు నాకే తెలియని ఇన్నాళ్ళూ నాకే తెలియని
నన్ను నేనే నీలో చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా…

choostunnaa choostu unnaa choostUnE unnaa
ippuDE ikkaDE vintagaa kanuvindugaa
innaaLLu naakE teliyani innaaLLU naakE teliyani
nannu nEnE neelO choostunnaa choostu unnaa choostUnE unnaa…

pacchani maagaaNi chElu paTTucheeragaa kaTTi
bangaru udayaala sirulu nosaTa baasikamgaa chuTTi
mungiTa sankraanti muggulu chekkiTa siggulugaa diddi
punnami padahaaru kaLalu sigalO puvvulugaa peTTi
dEvErigaa paadam peDataananTU
naaku Sreevaarigaa paTTam kaDataananTU
nava nidhulu vadhuvai vastunTE
saakshaattU SreemannaaraayaNuDE nEnainaTTU
choostunnaa choostu unnaa choostUnE unnaa

nuvvu sEvistunTE nEnu saarvabhoumuDai pOtaanu
nuvvu tODai unTE saagaraalu daaTEstaanu
nee soundaryamtO indhra padavinediristaanu
nee saannityamlO nEnu swargamanTE EdanTaanu
ELLE vacchI vayasunu maLListunTE
nE nee oLLO paapaga chiguristunTE choostunnaa…
choostunnaa choostu unnaa choostUnE unnaa
ippuDE ikkaDE vintagaa kanuvindugaa
innaaLLu naakE teliyani innaaLLU naakE teliyani
nannu nEnE neelO choostunnaa choostu unnaa choostUnE unnaa…

Movie :Mogudu
Lyricist :Sirivennela
Singers :Karthik
Music :Babu Shankar

Comments are closed.