తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా

Posted by Srikanth on April 11th, 2010

Submitted by ARUN

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో, విందో లేదో కలేంకాదే ఇదంతా
ఇంతలోనే అంత మైకం పనికి రాదే ప్రాణమా
పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా
తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో, విందో లేదో కలేంకాదే ఇదంతా

కుడివైపున ఇంకో హృదయం ఉన్నా సరిపోదో ఏమో ఈ వెలుగును దాచాలంటే
పడమరలోనైనా ఉదయం ఈ రోజే చూసానేమో మనసంతా ప్రేమైపోతే
ఎగిరొచ్చిన ఏదో లోకం నా చుట్టూ వెలిసిందేమో మైమరపున నే నిలిచుంటే
ఇంతలోనే అంత మైకం పనికి రాదే ప్రాణమా
పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా
తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో, విందో లేదో కలేంకాదే ఇదంతా

ఇదే క్షణం శిలై నిలవని సదా మనం ఇలా మిగలని
జన్మంటే ఇదంటూ తెలీదే ఇన్నాళ్ళు
నీ జంటై ఇవ్వాళే జీవించా నూరేళ్ళు
తనేమందో.. మదేం విందో..

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో, విందో లేదో కలేంకాదే ఇదంతా
ఇంతలోనే అంత మైకం పనికి రాదే ప్రాణమా
పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా
తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో, విందో లేదో కలేంకాదే ఇదంతా

tanEmandO andO lEdO teleelEdE nijamgaa
madEm vindO, vindO lEdO kalEmkaadE idantaa
intalOnE anta maikam paniki raadE praaNamaa
paravaSamlO munigipOtE paiki raagalamaa
tanEmandO andO lEdO teleelEdE nijamgaa
madEm vindO, vindO lEdO kalEmkaadE idantaa

kuDivaipuna inkO hRdayam unnaa saripOdO EmO ee velugunu daachaalanTE
paDamaralOnainaa udayam ee rOjE choosaanEmO manasantaa prEmaipOtE
egirocchina EdO lOkam naa chuTTU velisindEmO maimarapuna nE nilichunTE
intalOnE anta maikam paniki raadE praaNamaa
paravaSamlO munigipOtE paiki raagalamaa
tanEmandO andO lEdO teleelEdE nijamgaa
madEm vindO, vindO lEdO kalEmkaadE idantaa

idE kshaNam Silai nilavani sadaa manam ilaa migalani
janmanTE idanTU teleedE innaaLLu
nee janTai ivvaaLE jeevinchaa noorELLu
tanEmandO.. madEm vindO..

tanEmandO andO lEdO teleelEdE nijamgaa
madEm vindO, vindO lEdO kalEmkaadE idantaa
intalOnE anta maikam paniki raadE praaNamaa
paravaSamlO munigipOtE paiki raagalamaa
tanEmandO andO lEdO teleelEdE nijamgaa
madEm vindO, vindO lEdO kalEmkaadE idantaa

Movie :Ganesh(new)

Comments are closed.