నాలో నేనేనా ఏదో అన్నానా

Posted by Srikanth on December 26th, 2009

నాలో నేనేనా ఏదో అన్నానా
నాతోనే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువు విన్నావేమో
విన్న మాటేదో నిన్నడగనా (2)
అలా సాగిపోతున్నా నాలోనా
ఇదెంటిలా కొత్త ఆలోచన
మనసే నాది మాటే నీది ఇదేం మాయో
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతోనే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువు విన్నావేమో
విన్న మాటేదో నిన్నడగనా

అవును కాదు తడబాటుని అంతో ఇంతో గడి దాటని
విధి విడిపోనీ పరదాని పలుకై రానీ ప్రాణాన్ని
యదంతా పదాల్లోన పలికేనా
నా మౌనమే ప్రేమ ఆలాపన
మనసే నాది మాటే నీది ఇదేం మాయో
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతోనే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా

దైవం వరమై దొరికిందనీ నాలో సగమై కలిసిందనీ
మెలకువ కాని హృదయాన్నీ చిగురై పోని శిశిరాన్నీ
నీతో చెలిమి చేస్తున్నా నిమిషాలు నూరేళ్ళుగా ఎదిగిపోయాయిలా
మనమే సాక్షం మాటే మంత్రం ప్రేమే బంధం
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతోనే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువు విన్నావేమో
విన్న మాటేదో నిన్నడగనా

Submitted Sri Sravani

Movie :Baanam

Comments are closed.