నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా

Posted by Srikanth on January 30th, 2010

నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా..నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతు ఉన్నా

సరసా సరాగాలా సుమరాణిని స్వరసా సంగీతాలా సారంగిని (2)
మువ్వా మువ్వకు ముద్దు మురిపాలు పలుకా (2)
మవ్వంపు నటనాల మాతంగిని
కైలాస శిఖరాగ్ర శైలూషికా నాట్య డోలలూగే వేళ రావేల నన్నేల
నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా..నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతు ఉన్నా
నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా..నిన్నటిదాకా శిలనైనా

నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని (2)
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే (2)
చిరునవ్వులో నేను సిరిమల్లిని
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు చెంత వెలిగే వేళ ఈ చింత నీకేల
నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా..నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతు ఉన్నా
నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా..నిన్నటిదాకా శిలనైనా

Comments are closed.