నీ వెంట నేనే అడుగడుగడుగున

Posted by Srikanth on April 19th, 2010

నీ వెంట నేనే అడుగడుగడుగున
నీ జంట నేనే అణువణువణువున
నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా.. (2)
మనమే ఒకరికి ఒకరను ఈ పయననా
మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన (2)

ముద్దుతో పాపిటలోనె దిద్దవా కస్తూరీ
ప్రేమతో పెదవుల పైనే చేయవా దస్తూరీ
చూపులే పారాణి ఊపిరే సాంబ్రాణి
రూపమే దీపం గా రాతిరే పగలవనీ

నీ వెంట నేనే అడుగడుగడుగున
నీ జంట నేనే అణువణువణువున
నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా..
మనమే ఒకరికి ఒకరను ఈ పయననా
మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన (2)

వెచ్చని అల్లరిలోనే సూర్యుడే కరగాలి
చల్లని అలసటలోనే చంద్రుడే నిలవాలి
తార కాపురమల్లే కాపురం వెలగాలి
నిత్య సంక్రాంతల్లే జీవితం సాగాలి

నీ వెంట నేనే అడుగడుగడుగున
నీ జంట నేనే అణువణువణువున
నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా..
మనమే ఒకరికి ఒకరను ఈ పయననా
మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన
మనసే సుమమై విరిసెను నా సిగలోనా
మమతే ముడులై వెలిసెను నా మెడలోనా

Movie :Shock

Comments are closed.