భారం భారం భారం ఓ.. ఓ.. తీరం లేని భారం

Posted by Srikanth on June 16th, 2011

Another peradi, just for fun and not meant
to hurt anyone. If it hurts I’m sorry :)

భారం భారం భారం ఓ.. ఓ.. తీరం లేని భారం
ఎన్నో పరీక్షలు రాసినా ఎన్నో చిట్టీలే పెట్టినా
అన్నీ సబ్జెక్ట్లూ మిగిలినాయే
చదివే బడవతో తిరిగినా చదువే ప్రపంచం చేసినా
మరో సెప్టెంబర్ రమ్మన్నారే
ఒకే సెమ్ములో ఓ.. ఓ.. పదే రాసినా వెలేసినారే ఓ.. ఓ..
అదే గతాన్నీ ఓ.. ఓ.. అదే నిజాన్నీ చూపించినారే ఓ.. ఓ..
ఎన్నో పరీక్షలు రాసినా ఎన్నో చిట్టీలే పెట్టినా అన్నీ సబ్జెక్ట్లూ మిగిలినాయే
భారం భారం భారం ఓ.. ఓ.. తీరం లేని భారం

ఓ ఇంత కష్టమా ఇంజనీర్ల సబ్జెక్ట్
ఎంత కాలమో పాసు లేని రిజల్ట్
ఇంట ఫోను చేసి డబ్బు అడిగే దారే లేదే ఎలాగే
ఓ క్లాసుమేటు లేక ఒంటరైన సెంటర్
చిట్టలోన లేదే ఒక్కటైనా ఆన్సర్
వందసార్లు చదివినా గురుతే లేని మరుపే
కాంటీనులోన దమ్ము కొడితే సారు చూసి ఉన్నడే
ముప్పైఐదులోని మార్క్సు తింటు వాడు నవ్వుతున్నడే
ఎన్నో పరీక్షలు రాసినా ఎన్నో చిట్టీలే పెట్టినా అన్నీ సబ్జెక్ట్లూ మిగిలినాయే
భారం భారం భారం ఓ.. ఓ.. తీరం లేని భారం

ఒక్క మార్కుకుడ వెయ్యలేని కౌంటింగ్
ఒక్క అంగుళంకుడ లేనేలేని పాస్ లిస్ట్
ఆరు సెమ్ముల చిన్ని కాలాన్ని ఏడేళ్ళు చేసిందే
మొదటి సెమ్ములోన రెండో సెమ్ము సిలబస్
ప్రశ్న ప్రశ్నకొక్క బిక్కు బిక్కు చూపు
నాలుగేళ్ళ ముచ్చటే ముళ్ళ బాటగా మార్చే
సప్లీ లేని యూనివర్సిటిని చూసి మండుతున్నదీ
మొదలైన చోటే కాలమంత గడిచే కదలనన్నదీ ఓ.. ఓ..
ఎన్నో పరీక్షలు రాసినా ఎన్నో చిట్టీలే పెట్టినా అన్నీ సబ్జెక్ట్లూ మిగిలినాయే
భారం భారం భారం ఓ.. ఓ.. తీరం లేని భారం

Movie :Peradi
Lyricist :Myself
Singers :You can try
Music :DeviSriPrasad (Sorry DSP, used your tune)

Comments are closed.