మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా

Posted by Srikanth on March 21st, 2010

Requested by Lokesh…

ఓ ప్రేమా… ప్రేమా… ప్రేమా…
మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా
మన్నించు ఓ ప్రేమా మరుగేల చెప్పమ్మా
దరిచేరు దారేదైనా చూపించుమా
చెప్పనంటు దాచటానికైనా అంత చెప్పరాని మాట కాదు ఔనా
ఇంత మంచి వేళ ఎదురైన మరి చెప్పుకోవా ఇంక ఇప్పుడైనా
పట్టరాని ఆశ పెంచుకున్నా అది మోయరాని భారమవుతున్నా
చెప్పుకుంటే తప్పులేదు అయినా నువ్వు ఒప్పుకోవొ ఏమో అనుకున్నా
ఓ ప్రేమా… ప్రేమా… ప్రేమా…
మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా

జంట కమ్మని వెంటరమ్మని పిలిచే నేస్తమా
కొంత చేరువై కొంత దూరమై ఉంటే న్యాయమా
రెండు చేతులా అందుకోమని అనవేం స్నేహమా
చెంత నిలిచినా చెయ్యి కలపవే నాదే నేరమా
చొరవగా పొదువుకో నడిపే ప్రణయమా
బిడియమే వదులుకో బెదిరే ప్రియతమా
తగిన తరుణమని ఉదయ కిరణమై ఎదురుపడిన వరమా
మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా

అన్నివైపులా చెలిమి కాపలా అల్లే బంధమా
మబ్బులో అలా తాకితే ఎలా దిగిరా చంద్రమా
నిదురలో అలా నిలిచిపోకలా మెరిసే స్వప్నమా
కంటిపాపలా కబురులేమిటో చెబితే పాపమా
తలపునే తెలుపవేం నాలో ప్రాణమా
పెదవిపై పలకవేం ఊహా గానమా
మదిని మీటినది నీవు కాదా మరి మధురమైన స్వరమా

మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా
చెప్పనంటు దాచటానికైనా అంత చెప్పరాని మాట కాదు ఔనా
ఇంత మంచి వేళ ఎదురైన మరి చెప్పుకోవా ఇంక ఇప్పుడైనా
ఓ ప్రేమా… ప్రేమా… ప్రేమా…
ఓ ప్రేమా… ప్రేమా… ప్రేమా…

O prEmaa… prEmaa… prEmaa…
manninchu O prEmaa muripinchukOkammaa
mounaalu kariginchElaa maaTaaDumaa
manninchu O prEmaa marugEla cheppammaa
darichEru daarEdainaa choopinchumaa
cheppananTu daachaTaanikainaa anta chepparaani maaTa kaadu ounaa
inta manchi vELa eduraina mari cheppukOvaa inka ippuDainaa
paTTaraani aaSa penchukunnaa adi mOyaraani bhaaramavutunnaa
cheppukunTE tappulEdu ayinaa nuvvu oppukOvo EmO anukunnaa
O prEmaa… prEmaa… prEmaa…
manninchu O prEmaa muripinchukOkammaa
mounaalu kariginchElaa maaTaaDumaa

janTa kammani venTarammani pilichE nEstamaa
konta chEruvai konta dooramai unTE nyaayamaa
renDu chEtulaa andukOmani anavEm snEhamaa
chenta nilichinaa cheyyi kalapavE naadE nEramaa
choravagaa poduvukO naDipE praNayamaa
biDiyamE vadulukO bedirE priyatamaa
tagina taruNamani udaya kiraNamai edurupaDina varamaa
manninchu O prEmaa muripinchukOkammaa
mounaalu kariginchElaa maaTaaDumaa

annivaipulaa chelimi kaapalaa allE bandhamaa
mabbulO alaa taakitE elaa digiraa chandramaa
niduralO alaa nilichipOkalaa merisE swapnamaa
kanTipaapalaa kaburulEmiTO chebitE paapamaa
talapunE telupavEm naalO praaNamaa
pedavipai palakavEm oohaa gaanamaa
madini meeTinadi neevu kaadaa mari madhuramaina swaramaa

manninchu O prEmaa muripinchukOkammaa
mounaalu kariginchElaa maaTaaDumaa
cheppananTu daachaTaanikainaa anta chepparaani maaTa kaadu ounaa
inta manchi vELa eduraina mari cheppukOvaa inka ippuDainaa
O prEmaa… prEmaa… prEmaa…
O prEmaa… prEmaa… prEmaa…

Movie :Ela cheppanu

Comments are closed.