ముద్దుల ముద్దుల కన్నె నేనేరా

Posted by Srikanth on February 3rd, 2011

ముద్దుల ముద్దుల కన్నె నేనేరా
సిరివెన్నెల వేళలో వేచిఉన్నారా
సిగ్గుల మొగ్గల హొయలు నావేరా
నును బుగ్గల నిగ్గులు గిల్ల్కో రా రా
నిన్నే కని నీ నవ నవ ఊహలో తేలా
నీ తోడునై ఓ తరగని అకోరా
ముద్దుల ముద్దుల కన్నె నేనేరా
సిరివెన్నెల వేళలో వేచిఉన్నారా
ముద్దుల ముద్దుల కన్య నేనేరా
సిరివెన్నెల వేళలో వేచిఉన్నారా
సిగ్గుల మొగ్గల హొయలు నావేరా
నును బుగ్గల నిగ్గులు గిల్ల్కో రా రా

యదలో నీ యదలో తేనొలికిన అలికిడి కానా
జతలో నీ జతలో నే నిలువున మైమరచేనా
ఒడిలో నీ ఒడిలో చురు చురుకుగ ప్రియముడిపడనా
లయలో నీ లయలో సుమ ఊయలలే ఊగేయినా
నాలో దాగున్నా సుఖమేదో ఈ వేళ
నువు నాకు తెలిపావే గిలిగింతలయ్యేలా
నీతో ఇలా.. హే చిలిపిగ కలబడిపోని
ఇన్నాళ్ళుగా నా కల ఇక కలయిక కాని
ముద్దుల ముద్దుల కన్నె నీవేలే
నీ వెచ్చని ముద్దుకి కాచుకున్నాలే
సిగ్గుల మొగ్గల హొయలు చూసానే
నును బుగ్గల నిగ్గులు గిల్లుకుంటానే

చలిలో వెన్నెలలో నిను ఒకపరి తాకితే చాలు
చెలి నీ చెక్కిలిపై చిరుముద్దే పెడితే చాలు
మదిలో నా మదిలో నీ మృదుపరవశమే చాలు
అది ఓ క్షణమైనా ఈ కౌగిట వాలితే చాలు
చాలులే అన్నా సరిపోదు సంతోషం
నా నిదురలోనైనా విడిపోదు నీ విరహం
వయ్యారమా నీ సొగసులు పొగడగ తరమా
విశాలమవు నీ నడుమిక అది నా వశమా
ముద్దుల ముద్దుల కన్నె నేనేరా
సిరివెన్నెల వేళలో వేచిఉన్నారా
సిగ్గుల మొగ్గల హొయలు చూసానే
నును బుగ్గల నిగ్గులు గిల్లుకుంటానే
నిన్నే కని నీ నవ నవ ఊహలో తేలా
నీ తోడునై….

muddula muddula kanne nEnEraa
sirivennela vELalO vEchiunnaaraa
siggula moggala hoyalu naavEraa
nunu buggala niggulu gillkO raa raa
ninnE kani nee nava nava UhalO tElaa
nee tODunai O taragani akOraa
muddula muddula kanne nEnEraa
sirivennela vELalO vEchiunnaaraa
muddula muddula kanya nEnEraa
sirivennela vELalO vEchiunnaaraa
siggula moggala hoyalu naavEraa
nunu buggala niggulu gillkO raa raa

yadalO nee yadalO tEnolikina alikiDi kaanaa
jatalO nee jatalO nE niluvuna maimarachEnaa
oDilO nee oDilO churu churukuga priyamuDipaDanaa
layalO nee layalO suma UyalalE UgEyinaa
naalO daagunnaa sukhamEdO ee vELa
nuvu naaku telipaavE giligintalayyElaa
neetO ilaa.. hE chilipiga kalabaDipOni
innaaLLugaa naa kala ika kalayika kaani
muddula muddula kanne neevElE
nee vecchani mudduki kaachukunnaalE
siggula moggala hoyalu choosaanE
nunu buggala niggulu gillukunTaanE

chalilO vennelalO ninu okapari taakitE chaalu
cheli nee chekkilipai chirumuddE peDitE chaalu
madilO naa madilO nee mRduparavaSamE chaalu
adi O kshaNamainaa ee kougiTa vaalitE chaalu
chaalulE annaa saripOdu santOsham
naa niduralOnainaa viDipOdu nee viraham
vayyaaramaa nee sogasulu pogaDaga taramaa
viSaalamavu nee naDumika adi naa vaSamaa
muddula muddula kanne nEnEraa
sirivennela vELalO vEchiunnaaraa
siggula moggala hoyalu choosaanE
nunu buggala niggulu gillukunTaanE
ninnE kani nee nava nava UhalO tElaa
nee tODunai….

Movie :Salute
Lyricist :Sahiti
Singers :Balram, Bombay Jayashree, Sunitha Sarathy
Music :Harris Jayaraj

Comments are closed.