వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకి

Posted by Srikanth on October 26th, 2010

Req by Ramu

వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకి
కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికి
నిను దాచే ఈ నిశీ నిలిచేనా ప్రేయసీ
నలువైపుల నల్లని చీకట్లే ఎదురొస్తూ ఉన్నా
పరుగాపని పాదం దూరంతో పోరాడుతు ఉన్నా
కనుపాపకి ఉప్పని కన్నీరే తెరవేస్తూ ఉన్నా
ప్రతి నిమిషం నీ వైపే పయనిస్తూ ఉన్నా
వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకి

గాలితో నువ్వు పంపిన వలపు ఊసేమిటో
పూలలో నువ్వు నింపిన తీపి తలపేమిటో
నిన్న దాకా నను చేరలేదని నమ్మదా చెలీ నీ మౌనం
నా శ్వాసతొ రగిలే గాలులతో నిను వెతికిస్తున్నా
నా ప్రేమను పూల సువాసనతో నీకందిస్తున్నా
యద సవ్వడులే ఆ గువ్వలుగా ఎగరేస్తూ ఉన్నా
అవి నిన్నే చూడాలి నువ్వెక్కడ ఉన్నా
వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకి

ఆశగా ఉంది నెచ్చెలి కలుసుకోవాలనీ
కోవెలై ఉంది కౌగిలి దేవి రావాలనీ
నీవు కలవని కలవు కాదనీ ఋజువు చేయనీ అనురాగం
నను నేనే శిలగా మోస్తున్నా యద బరువైపోగా
చిరు నవ్వుల్నే వెలి వేస్తున్నా నిను చూసేదాకా
ప్రతి రక్త కణం వెలిగిస్తున్నా పెను జ్వాలైపోగా
యడబాటు పొరబాటు కరిగించే దాకా

వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకి
కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికి
నిను దాచే ఈ నిశీ నిలిచేనా ప్రేయసీ
నలువైపుల నల్లని చీకట్లే ఎదురొస్తూ ఉన్నా
పరుగాపని పాదం దూరంతో పోరాడుతు ఉన్నా
కనుపాపకి ఉప్పని కన్నీరే తెరవేస్తూ ఉన్నా
ప్రతి నిమిషం నీ వైపే పయనిస్తూ ఉన్నా
వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకి

vEyi janmaala chelimi neevE telusu naa gunDeki
kOTi deepaala velugu neevE telusu naa kanTiki
ninu daachE ee niSI nilichEnaa prEyasI
naluvaipula nallani cheekaTlE edurostU unnaa
parugaapani paadam dooramtO pOraaDutu unnaa
kanupaapaki uppani kanneerE teravEstU unnaa
prati nimisham nee vaipE payanistU unnaa
vEyi janmaala chelimi neevE telusu naa gunDeki

gaalitO nuvvu pampina valapu UsEmiTO
poolalO nuvvu nimpina teepi talapEmiTO
ninna daakaa nanu chEralEdani nammadaa chelI nee mounam
naa Swaasato ragilE gaalulatO ninu vetikistunnaa
naa prEmanu poola suvaasanatO neekandistunnaa
yada savvaDulE aa guvvalugaa egarEstU unnaa
avi ninnE chooDaali nuvvekkaDa unnaa
vEyi janmaala chelimi neevE telusu naa gunDeki

aaSagaa undi neccheli kalusukOvaalanI
kOvelai undi kougili dEvi raavaalanI
neevu kalavani kalavu kaadanI Rjuvu chEyanI anuraagam
nanu nEnE Silagaa mOstunnaa yada baruvaipOgaa
chiru navvulnE veli vEstunnaa ninu choosEdaakaa
prati rakta kaNam veligistunnaa penu jwaalaipOgaa
yaDabaaTu porabaaTu kariginchE daakaa

vEyi janmaala chelimi neevE telusu naa gunDeki
kOTi deepaala velugu neevE telusu naa kanTiki
ninu daachE ee niSI nilichEnaa prEyasI
naluvaipula nallani cheekaTlE edurostU unnaa
parugaapani paadam dooramtO pOraaDutu unnaa
kanupaapaki uppani kanneerE teravEstU unnaa
prati nimisham nee vaipE payanistU unnaa
vEyi janmaala chelimi neevE telusu naa gunDeki

Comments are closed.