Skip to main content

Posts

ఓ… చెలి తారా

ఓ   చెలి తారా  నా మనసారా మరలా   మరలా మరలా నిను రమ్మని వెలుగే తెమ్మని మరోసారి నీతో అంటున్నా   అనగా అనగా  కలలాగా నిన్ను అనుకోలేను జతగా కదిలే కథలాగా నీతో కలిసుంటాను నీతో కలిసుంటాను   నచ్చి చేరువైనదేదో  ఇట్టే దూరమైనదే నాతో ఉండి లేనిదేదో  నేడే అర్థమైనదే ఏదో వెలితి ఏదో శూన్యం  నలిగినది హృదయం కదలదిక సమయం  ఓ   చెలితారా   నువ్వే పక్కనున్న పూటా  పాటే పండు వెన్నెలా తోడై నువ్వు లేని చోటా  నేనో మూగ కోయిలా నువ్వే నాలో చలనం  ఎదనూయలలూపే పవనం నువ్వే లేని విరహం  ప్రతిక్షణమూ నాకో మరణం రావె చెలియా నీ రాకే కిరణం ఓ   చెలితారా నా   చెలితారా

తాను నేను మొయిలు మిన్ను

తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను శశి తానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు దివ్వె తెలుగు తీపి తాను నేను మనసు మేను దారి నేను తీరం తాను దారం నేను హారం తాను దాహం నేను నీరం తాను కావ్యం నేను సారం తాను నేను తాను రెప్ప కన్ను వేరైపోనీ పుడమి మన్ను నేను తాను రెప్ప కన్ను వేరైపోనీ పుడమీ మన్ను తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను గానం గమకం తాను నేను ప్రాయం తమకం తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను శశి తానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు దివ్వె తెలుగు తీపి తాను నేను మనసు మేను మనసు మేను మనసు మేను…

నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు

నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు నువ్వంటు నేనంటు లేమని అవునంటు మాటివ్వు నిజమంటునే నువ్వు నే రాని దూరాలే నువు పోనని ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ దగ్గరగా రానీను దూరమే నే వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వడుగు నిలుచున్నా నీ వైపే చేరేనులే నీ అడుగేమో పడి నేల గుడి అయినదే నీ చూపేమో సడి లేని ఉరుమయినదే నువ్వు ఆకాశం నేను నీకోసం తడిసిపోదామ ఈ వానగా ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యునితో జతకట్టి ఒకటవుతాయే నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ నే ఇటు వస్తాననుకోలేదా తలుపస్సలు తియ్యవు తడితే పో పసివాడని జాలే పడితే బుగ్గన ముద్దిచ్చి చంపేసావే నువ్వు నేనంటు పలికే పదముల్లో అధరాలు తగిలేనా కలిసే ఉన్నా మనమంటూ పాడు పెదవుల్లో చూడు క్షణమైన విడిపోవులే ఇది ఓ వేదం పద ఋజువవుదాం అంతులేని ప్రేమకే మనం నివురు తొలిగేలా నిజము గెలిచేలా మౌనమే మాట మార్చేసినా నువు నవ్వేటి కోపానివే మనసెతికినా ఓ రాయివే నువు కలిసొచ్చే శాపానివే నీరల్లే మారేటి రూపానివే నచ్చే దారుల్లో నడిచే నదులైనా కాదన్నా కలవాలి సంద్రంలోనా విడివిడిగా ఉన్నా విడిపోలేకున్నా ప్రవహించే ప్రణయం ఇదే వద్దన్నా తిరిగేటి భువి మీదొట్టు నా ప్రాణం తిర...

పెనిమిటి ‌‌‌పేరడీ

ఈ పాట మాతృక రాసిన రామ జోగయ్య శాస్త్రి గారి కి వందనాలు గృహిణుల కష్టాలకి నా ఈ పాట అంకితం చంద్రుడ్ని చూసేసి తలుపుల్ని తెరిచాను నువ్వొచ్చే దారుల్లో ట్రాఫిక్కు చూసాను కమ్యూటు బండెక్కి రా రా మనసిటీ గుంతల్లో పదిలంగా రా రా కాలేటి అట్లకాడ గుర్తొచ్చి రా రా అరకోటి బూతులతో పిలిచినా రా రా పెనిమిటి ఎన్నినాళ్ళయినాదో కను చూసి రక్తాన్ని ఎన్నెన్నినాళ్ళయినాదో కను చూసి రక్తాన్ని చిమ్మటీ చీకటి పొద్దుటి గ్రీనుటీ ఎర్రటి కుంపటి నల్లటి బూటొకటి కర్రల్లో పొడవటి ఉందిలే ముచ్చటి గొంతు మీద ‌కాలు వేసి ఆడతాను రా రా పెనిమిటి కొలువేమో ఐటి అన్నావని తెగ పొంగిపోయా పిచ్చిదానిని విడుదల లేని ఒక‌ వంటదానిని చేస్తివి గదా‌ నన్ను బలిపశువుని చూసీ చూడక చులకన చేస్తివి నా‌ తలరాతనే నువ్వే రాస్తివి చీపురు కట్ట తలచుకొని తరలి తరలి రా రా పెనిమిటి ఆఫీస్నుంచారుకే బయటి కొస్తివే పది గంటలైనా కంటి కందవే బేవార్సు దోస్తులతో సొల్లు పెడితివో ద్రాక్షపు బుడగలలో తడిసిపోతివో ఏ చెత్త తింటివో యాడ కక్కుంటివో మందుకిక్కు తలకెక్కి యాడ పడుకుంటివో నువ్వు గన్న తాటకినైన తలచి తలచి రా రా పెనిమిటి

ఓ నీలవేణి నీలవేణీ రావే అలకమాని

Back with a beautiful lyric ఓ నీలవేణి నీలవేణీ రావే అలకమాని నీ హంస నడకలని ఫాలో అవుతున్నానని కోపం లోనూ ఇంతందమా మనకి మనకి తేడాలెన్నో ఉన్నా కూడా కూడా రానా నీడై నీడై పోనా ఇలా.. తేడాలెన్నో ఉన్నా కూడా కూడా రానా నీడై నీడై పోనా ఇలా.. ఎండపడి ఎర్ర ఎర్రగా కందినదె లేత బుగ్గ గొంతు తడి ఆరి ఎంతగా వాడినదొ మల్లెమొగ్గ నీకోసం నీలి మబ్బునై ఆకాశం చేరనా నేనే ఓ వాన జల్లునై ఒళ్ళంతా తడమనా కూడా కూడా రానా నీడై నీడై పోనా తేడాలెన్నో ఉన్నా ఇలా.. ఇలా.. సోయగము విసిరి గుండెకే చేయకిక తీపి గాయం సోకులతో నన్ను చంపటం నీకు ఇది ఏమి న్యాయం నీ పంతం మొయ్యలేనిదని ఏనాడో తెలిసినా నువ్వేడు మల్లెలెత్తువని ఇష్టంగా మోయనా కూడా కూడా రానా నీడై నీడై పోనా తేడాలెన్నో ఉన్నా ఇలా.. ఇలా.. O neelavENi neelavENI raavE alakamaani nee hamsa naDakalani faalO avutunnaanani kOpam lOnU intandamaa manaki manaki tEDaalennO unnaa kooDaa kooDaa raanaa neeDai neeDai pOnaa ilaa.. tEDaalennO unnaa kooDaa kooDaa raanaa neeDai neeDai pOnaa ilaa.. enDapaDi erra erragaa kandinade lEta bugga gontu taDi aari entagaa vaaDinado mallemogga neekOsam neeli mabbunai aakaa...

ఆవేశమంతా ఆలాపనేలే

ఆవేశమంతా ఆలాపనేలే.. యద లయలో ఆవేశమంతా ఆలాపనేలే.. ఉదయినిగా నాలో జ్వలించే వర్ణాల రచన నాలో జలించే స్వరాలా ఆవేశమంతా ఆలాపనేలే అలపైటలేసే సెలపాట విన్న గిరివీణమీటే జలపాతమన్న నాలోన సాగే ఆలాపన రాగాలుతీసే ఆలోచన జర్ధరతల నాట్యం.. అరవిరుల మరుల కావ్యం ఎగసి ఎగసి నాలో గళ మధువులడిగె గానం నిదురలేచె నాలో హౄదయమే.. ఆవేశమంతా ఆలాపనేలే.. యదలయలో ఆవేశమంతా ఆలాపనేలే… వలకన్యలాడే తొలి మాసమన్నా గోధూళి తెరలొ మలిసంజె కన్నా అందాలు కరిగే ఆవేదన నాదాల గుడిలో ఆరాధన చిలిపి చినుకు చందం.. పురివిడిన నెమలి పింఛం యదలు కదిపి నాలో.. విరిపొదలు వెతికె మోహం బదులు లేని ఎదో పిలుపులా ఆవేశమంతా ఆలాపనేలే.. యదలయలో నాలో జ్వలించే వర్ణాల రచన నాలో జలించే స్వరాలా ఆవేశమంతా ఆలాపనేలే..

నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే... అదేమిటే

DSP Rocks as Lyricist as well! నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే… అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే… అదేమిటే ఏమిటో ఏం మాయో చేసినావే కంటి చూపుతోటి ఏమిటో ఇదేమి రోగమో అంటించినావే ఒంటి ఊపుతోటి ముంచే వరదలా కాల్చే ప్రమిదలా ముంచావే మరదలా నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే… అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే… అదేమిటే ఏయ్.. అంత పెద్ద ఆకాశం, అంతులేని ఆ నీలం నీ చేప కళ్ళ లోతుల్లో ఎట్ట నింపావే ఇరగదీసావే ఏయ్.. భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం దాన్ని నువ్వు భూమిపైన పెరిగేస్తూ ఇట్ట తిరిగేస్తూ తిరగరాసావే ఏయ్.. అలా నువ్వు చీర కట్టి చిందులేస్తె చీమలా నేను వెంటపడనా నావలా నువ్వు తూగుతూ నడుస్తుంటే కాపలాకి నేను వెంటరానా కృష్ణ రాధలా నొప్పి బాధలా ఉందాం రావే మరదలా అత్త లేని కోడలుత్తమురాలు ఓరమ్మా కోడల్లేని అత్త గుణవంతురాలు కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఓరమ్మా పచ్చి పాల మీద మీగడేదమ్మా వేడి పాలల్లోన వెన్న ఏదమ్మా మోనలిసా చిత్రాన్ని గీసినోడు ఎవడైనా ఈ పాల సీస అందాన్ని చూడనేలేదు ఇంక ఏం లాభం కోహినూరు వజ్రాన్ని ...

ఓ మధురిమవే ఎందుకు వచ్చావే

Beautiful tune with superb lyrics ఓ మధురిమవే ఎందుకు వచ్చావే నా మనసునిలా ముక్కలు చేశావే నీ తలపులలో ముళ్ళే ఎన్నెన్నో… గాయం చేసే… ఇలా నీ కలవరమే వెల్లువలా తాకే ఈ కలయికలో వేదనలే చూపే నా యద లయలో అలజడులే ఎన్నో… ప్రళయం రేపే… ఇలా నీవే కోరి వెళుతున్న తీరం ఇదీ నన్నే కమ్ముకుంటున్న శూన్యం ఇదీ కలలా కలిసి గతమయ్యావే జతగా నడిచి కథవయ్యావే కలలా కలిసి గతమయ్యావే జతగా నడిచి కథవయ్యావే నా ప్రాణం నిన్నే కోరిందే చెలియా చెలియా… నిజమే కదటే నీ వైపే అడుగులు వేస్తుందే చెబితే వినదే ఈ నిమిషాన నా లోకం మారిందని… నమ్మాలా నా హృదయాన నీ రూపం మరుగవదే…. ఏమైనా కలలా కలిసి గతమయ్యావే జతగా నడిచి కథవయ్యావే కలలా కలిసి గతమయ్యావే జతగా నడిచి కథవయ్యావే O madhurimavE enduku vacchaavE naa manasunilaa mukkalu chESaavE nee talapulalO muLLE ennennO… gaayam chEsE… ilaa nee kalavaramE velluvalaa taakE ee kalayikalO vEdanalE choopE naa yada layalO alajaDulE ennO… praLayam rEpE… ilaa neevE kOri veLutunna teeram idI nannE kammukunTunna Soonyam idI kalalaa kalisi gatamayyaavE jatagaa...

ఏ మంత్రమో అల్లేసిందిలా

ఏ మంత్రమో అల్లేసిందిలా యదకే వేసే సంకెలా భూమెందుకో వణికిందే ఇలా బహుశా తనలో తపనకా ఆకాశం రూపం మారిందా నా కోసం వానై జారిందా గుండెల్లో ప్రేమై చేరిందా ఆ ప్రేమే నిన్నే కోరిందా మబ్బుల్లో ఎండమావే ఎండంతా వెన్నెలాయే మనసంతా మాయమాయే అయినా హాయే క్షణము ఒక ఋతువుగ మారే ఉరుము ప్రతి నరమును తరిమే పరుగులిక వరదలై పోయే కొత్తగా ఉన్నట్టు ఉండి అడుగులు ఎగిరే పగలు వల విసిరే ఊహలే మనసు మతి చెదరగ శిలగా నిలిచెగా కళ్ళల్లో కదిలిందా కలలా కల కరిగిపోకలా ఎదురయ్యే వేళల్లో నువు ఎగిరిపోకలా ఓ మాయలా ఇంకో మాయలా నన్నంత మార్చేంతలా ఓ మాయలా ఇంకో మాయలా నువ్వే నేనయ్యేంతలా, వెన్నెల్లా…. E mantramO allEsindilaa yadakE vEsE sankelaa bhoomendukO vaNikindE ilaa bahuSaa tanalO tapanakaa aakaaSam roopam maarindaa naa kOsam vaanai jaarindaa gunDellO prEmai chErindaa aa prEmE ninnE kOrindaa mabbullO enDamaavE enDantaa vennelaayE manasantaa maayamaayE ayinaa haayE kshaNamu oka Rtuvuga maarE urumu prati naramunu tarimE parugulika varadalai pOyE kottagaa unnaTTu unDi aDugulu egirE pagalu vala visirE UhalE manasu mati chedaraga Silagaa nilich...

ఏమిటో ఇవ్వాళ రెక్కలొచ్చినట్టు

ఏమిటో ఇవ్వాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్నా గుండెనే కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటి సారి ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెలే, కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి భాదలే ఆగని ప్రయాణమై యుగాలుగా సాగినా ఓ కాలమా నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా నువ్వే లేని నేను నేనుగా లేనే లేనుగా లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోనా జారిందిలే ఝల్లంటు వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ భాదకే ప్రేమన్న మాట తక్కువైందిగా గుండెలో చేరావుగా ఉచ్చ్వాశ లాగ, మారకే నిశ్వాశలా నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా, నువ్వలా ఉన్నవెలా నిన్నల్లోనే నిండిపోకలా నిజంలోకి రా కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవే అంటు మెలకువే కలే చూపే ఏం మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే ఏం చెయ్యను నువ్వే చెప్పవా ఈ భాదకే ప్రేమన్న మాట తక్కువైందిగా ఏమిటో ఇవ్వాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్నా గుండెనే కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటి సారి ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెలే, కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి భాదలే EmiTO ivvaaLa rekkalocchinaTTu v...

కొంచెము అర్ధమయ్యినా కొంచెము కొంచెము కాకపోయినా

కొంచెము అర్ధమయ్యినా కొంచెము కొంచెము కాకపోయినా కొంచెము బెట్టు చూపినా కొంచెము కొంచెము గుట్టు విప్పినా కొంచెము కసురుకున్నా మరి కొంచెము కొంచెము కొసరి నవ్వినా .. ఓ.. ఓ.. నీ గుండె లోతున భూతద్దమెయ్యనా ఎదో ఓ మూలన నన్నే చూడనా నీ గుండె లోతున భూతద్దమెయ్యనా ఎదో ఓ మూలన నన్నే చూడనా కొంచెము చూడవచ్చుగా కొంతైనా మాటాడవచ్చుగా పోని అలగవచ్చుగా పొగడాలంటే అడగవచ్చుగా నీకై మెల్లమెల్లగా పిచ్చోడ్నవుతున్నా జాలిపడవుగా ఓ.. ఓ.. పిసినారి నారివే పిసరంత పలకవే ఆ కంచ తెంచవే ఇవాళైనా పిసినారి నారివే పిసరంత పలకవే ఆ కంచ తెంచవే ఇవాళైనా కాకితో కబురు పంపినా కాదనకుండా వచ్చి వాలనా రెక్కలు లేకపోయినా చుక్కలకే నిను తీసుకెళ్ళనా జన్మలు ఎన్ని మారినా ప్రతి జన్మలో జంటగా నిన్ను చేరనా ఓ.. ఓ.. నీ గుండే గూటిలో నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియలేదా నీ గుండే గూటిలో నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియలేదా konchemu ardhamayyinaa konchemu konchemu kaakapOyinaa konchemu beTTu choopinaa konchemu konchemu guTTu vippinaa konchemu kasurukunnaa mari konchemu konchemu kosari navvinaa .. O.. O.. nee gunDe lOtuna bhootaddameyyanaa edO O moolana nannE choo...

ఐయాం వర్రీ సో వర్రీ ఐయాం వర్రీ సో వర్రీ

DISCLAIMER: సాధారణంగా ఒకరిని ఇమిటేట్ చేసినపుడు, ఈ పాత్రలు కేవలం కల్పితం ఎవరిని ఉద్దేశించినవి కావు అంటారు. కానీ, ఈ పాట మాత్రం రెండు ప్రధాన తెలుగు పత్రికలని ఉద్దేశించి రాసినదే. ఈ పాట “ప్రేమ” సినిమాలోని “ఐయాం సారీ సో సారీ” పాట ట్యూనుకు కుదురుతుంది. ఈ పాట అప్పట్లో రాసిన మహానుభావునికి వందనాలు, వారిని కించ పరిచే ఉద్దేశం కించిత్ కూడా లేదు Grow up Guys…. రాష్ట్రాన్ని మార్చాలంటే బేబీ మీడియా, నువ్వు గ్రో అప్ కావాలా రాసేసి సంపాదించాలంటే తండ్రీ మీడియా, నీకొక బకరా కావాలా అయ్యవారి బొమ్మ వేసిపెడితే బాబు శ్రీధరు, అది కోట్లు తెచ్చి పెట్టాలా ఐయాం వర్రీ సో వర్రీ ఐయాం వర్రీ సో వర్రీ న్యూసు చూస్తే ఒట్టి గాసే ప్రజాలోకం ఎడ్డిదాయే వ్యామోజి గగను బాబులు పోతేపోని మీకెంటి బాబులు వ్యామోజి గగను బాబులు పోతేపోని మీకెంటి బాబులు ఐయాం వర్రీ సో వర్రీ ఐయాం వర్రీ సో వర్రీ ఈగో కు అందరు దాసులురా, ఈగో కోసమేరా (2) వ్యామోజి రాసేది గగను జాతకం గగనుడు కోరినది ఆధిపత్యం (2) పెన్నుకు తుప్పు పట్టున్నది వెన్నుకు భయమే లేకున్నది అందుకనే లేనివని ఉన్నవని అనుకోక రాసెయ్యరా ఐయాం వర్రీ సో వర్రీ ఐయాం వర్రీ సో వర్రీ ...

నేనే నాని నే, నే నీ నాని నే

The best melody in recent times నేనే నాని నే, నే నీ నాని నే పోనే పోనీనే నీడై ఉన్నానే అరె అరె అరె అరె ఓ, అరె అరె అరె అరె ఓ కళ్ళకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి గాలిని తేలుతు ఉంటున్నానే అరె అరె అరె అరె ఓ, అరె అరె అరె అరె ఓ కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే అరె అరె అరె అరె ఓ, అరె అరె అరె అరె ఓ మాటల్లొ ముత్యాలే దాచేసినా చిరునవ్వు కాస్తైనా ఉలికించవా కోపం అయినా కోరుకున్నా అన్నీ నాకు నువ్వనీ కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే అరె అరె అరె అరె ఓ, అరె అరె అరె అరె ఓ నా భాషలో రెండే వర్ణాలనీ నాకింక నీ పేరే జపమవుననీ బిందు అంటే గుండె ఆగి దిక్కులన్నీ చూడనా కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే అరె అరె అరె అరె ఓ, అరె అరె అరె అరె ఓ nEnE naani nE, nE nee naani nE pOnE pOnInE neeDai unnaanE are are are are O, are are are are O kaLLaku ottulu veliginchi kalalaku rekkalu toDiginchi gaalini tElutu unTunnaanE are are are are O, are are are are O kanabaDinaa Oke, kanumarugavutunnaa Oke kanabaDinaa Oke, kanuma...

మనసే గువ్వై ఎగసేనమ్మో చెలి నీ మాటే వినపడగా

మనసే గువ్వై ఎగసేనమ్మో చెలి నీ మాటే వినపడగా పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా యద నాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా మంచల్లే కరిగేనే నీ గాలే నా పై వీచగా అయ్యయ్యో ప్రేమే పుట్టెనే అది అడగని ఆశై పట్టెనే నా యదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టెనే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు చెంతకొచ్చి నువు నిలవటం నిన్ను కలిసి నే వెళ్ళటం అనుదినం జరిగెడీ నాటకం ఒక సగాన్ని చెప్పెయ్యటం మరు సగాన్ని దాపెట్టటం తెలిసెలే తెలిసెలే కారణం కాలాలు పూచెలే వేగాలు వేచెలే కలువా నీ కాటుక కన్నుల చూపులు గారడి చేసెలే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు హే నా కంటికి ఏమైనదో రేయంత ఎరుగదు కునుకును ప్రియా నువు లేనిదె నే లేను నా మీద నీ సువాసన ఏనాడు వీచగ కోరెను ఎలా నిను చేరక బ్రతికేను నా ఇరు కల్లకి ఓ హరివిల్లువే నీ విరిసే నవ్వులే యదలో పూల జల్లులే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు...

గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల

గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల కొరకొర చూసెరా ఒంటరీ జింక పిల్ల ఎందుకొచ్చిందో ఏమి అవుతుందో.. అవుతుందో గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల కొరకొర చూసెరా ఒంటరీ జింక పిల్ల అమ్మ నాన్న ఏమి పేరు ఈమెకి పెట్టారో అరె సుత్తి అన్న పేరు నేనీ సుందరికెడతారో కొంచెమైనా నమ్మని పిల్ల బంకలాగ పట్టిందిల్లా విడిచి పెట్టి పోయేదెల్లా ఏమి గొడవిదిరా అండపిండాబ్రహ్మాండాలా మొండిఘటమే తగిలిన వేళ గుండె మంటల గుడుగుంజాలా గోల ఇతడిదిరా సందింత దొరికిందా సందేహ పడుతుంది ఏ కొద్దిపాటి చిరుబురుకైనా చిన్నబోతుంది చీమంతా చిల్లరకే తెగ చిందులేస్తుంది రవ్వంత దానికి రోడ్డు మీద రచ్చలు చేస్తుంది అరెరెరె అమ్మ నాన్న ఏమి పేరు ఈమెకి పెట్టారో సొగసరి బాపు బొమ్మ అన్న పేరీ ఈ గుమ్మకి పెడతారో అమ్మ బాబో నస అనుకుంటే ఎంత మంచి అమ్మాయల్లే చేతనైనా సాయం చేసే మనసు ఉన్నదిరా వింత స్నేహం వీరిది అవునో ఎంత కాలం కొనసాగేనో ఎప్పుడీ కథ ఏమయ్యేనో ఎవరికెరుకంట అబ్బాయి ఆ వైపు అమ్మాయి ఈ వైపు షేర్ ఆటోలో ఓ జర్నీలాగా సాగెలే లైఫు అతను తన చెంతకొచ్చిన అంత కోపం ఇప్పుడు లేదంటా తన వెంట వచ్చిన సందేహాలు టు నాట్ టు .. గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల కొరకొర చూసెరా ఒంటరీ జింక ప...

ముత్యాల ధారని, మురిపించే రేయిని

ముత్యాల ధారని, మురిపించే రేయిని నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ పుష్పించే తోటలో పులకించే గాలినై తెలవారుజామున తొలి గీతమే వినిపించనీ హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా ముత్యాల ధారని, మురిపించే రేయిని నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ పుష్పించే తోటలో పులకించే గాలినై తెలవారుజామున తొలి గీతమే వినిపించనీ ఓ అలలా.. ఓ సుమ ఝరిలా.. ఓ.. కదులుతున్న నీ కురులందే నే దాగనా వరించేటి వెన్నెల నీడై పులకించనా అరె వెన్నే తాకాలంటు మేఘం దాహంతోటి పుడమే చేరెనా వచ్చి నిన్ను తాకి మళ్ళి దాహం తీరిందంటు కడలే చేరెనా హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా ఓ. ఓ. రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా కలనైనా ఓ క్షణమైనా నిన్నే చేరమంటూ యదలో పోరాటం నిన్నే కోరుకుందే నాలో ఆరాటం పిల్లా చిన్ని బొంగరంలా నిన్నే చుట్టి చుట్టి తిరిగా కదమ్మా క్షణం నువ్వే దూరమైతే గుండె ఆగిపోదా జాలే లే...

చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా

Karthik rocks again with Sirivennela's beautiful lyric! చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా ఇన్నాళ్ళు నాకే తెలియని ఇన్నాళ్ళూ నాకే తెలియని నన్ను నేనే నీలో చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా... పచ్చని మాగాణి చేలు పట్టుచీరగా కట్టి బంగరు ఉదయాల సిరులు నొసట బాసికంగా చుట్టి ముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్ది పున్నమి పదహారు కళలు సిగలో పువ్వులుగా పెట్టి దేవేరిగా పాదం పెడతానంటూ నాకు శ్రీవారిగా పట్టం కడతానంటూ నవ నిధులు వధువై వస్తుంటే సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే నేనైనట్టూ చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా నువ్వు సేవిస్తుంటే నేను సార్వభౌముడై పోతాను నువ్వు తోడై ఉంటే సాగరాలు దాటేస్తాను నీ సౌందర్యంతో ఇంధ్ర పదవినెదిరిస్తాను నీ సాన్నిత్యంలో నేను స్వర్గమంటే ఏదంటాను ఏళ్ళే వచ్చీ వయసును మళ్ళిస్తుంటే నే నీ ఒళ్ళో పాపగ చిగురిస్తుంటే చూస్తున్నా... చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా ఇన్నాళ్ళు నాకే తెలియని ఇన్నాళ్ళూ నాకే తెలియని నన్ను నేనే నీలో చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా... choostunnaa choostu unnaa...

మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం

మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం పున్నమి నదిలో విహరించాలి పువ్వుల ఒళ్ళో పులకించాలి పావురమల్లే పైకెగరాలి తొలకరి జల్లై దిగిరావాలి తారల పొదరింట రాతిరి మజిలీ వేకువ వెనువెంట నేలకు తరలి కొత్త స్వేచ్చకందించాలి నా హృదయాంజలి మానసవీణ మౌన స్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం తూగే వాగు నా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం అలలాగే నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడూ నా సొంతం వాగు నా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం అలలాగే నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడూ నా సొంతం ఊహకు నీవే ఊపిరిపోసి చూపవే దారి ఓ చిరుగాలి కలలకు సైతం సంకెల వేసే కలిమి ఎడారి దాటించాలి తుంటరి తూనీగనై తిరగాలి దోసెడు ఊసులు తీసుకు వెళ్ళి పేద గరిక పూలకు ఇస్తా నా హృదయాంజలి మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే మానసవీణ మౌనస్వరానా జుమ్మని పా...

చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా.. నిన్నే ఆపేదెలా..

చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా.. నిన్నే ఆపేదెలా.. చివరికి నువ్వే అలా.. వేస్తావే వలా.. నీతో వేగేదెలా.. ఓ ప్రేమా.. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కలా.. కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది ఆ పై చేదెక్కుతోందిలా.. కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా.. చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా.. నిన్నే ఆపేదెలా.. చివరికి నువ్వే అలా.. వేస్తావే వలా.. నీతో వేగేదెలా.. నిప్పే ఇలా చేరగా మాటే మార్చి మాయే చెయ్యాలా నన్నే ఇక నన్నుగా ప్రేమించని ప్రేమేలా ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండాలా నన్నింతగా ఊరించేస్తూ అల్లేస్తోందే నీ సంకెలా కొంచెం మధురము కొంచెం విరహము ఇంతలో నువ్వు నరకం కొంచెం స్వర్గము కొంచెం శాంతము గొంతులో జారు గరళము కొంచెం పరువము కొంచెం ప్రళయము గుండెనే కోయు గాయము కొంచెం మౌనము కొంచెం గానము ఎందుకీ ఇంధ్రజాలము ఇన్నాళ్ళుగా సాగినా ప్రేమ నుంచి వేరైపోతున్నా మళ్ళీ మరో గుండెతో స్నేహం కోరి వెళుతున్నా ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా ఒకో క్షణం ఆ సంతోషం నాతోపాటు సాగేదెలా ఎలా చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా.. నిన్నే ఆపేదెలా.. చివరికి నువ్వే అలా.. వేస్తావే వలా.. నీతో వేగేదెలా.. ఓ ప్రేమా.. కన్నుల్లో వాలే రోజు ఎంతో ...

మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం

మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం పున్నమి నదిలో విహరించాలి పువ్వుల ఒళ్ళో పులకించాలి పావురమల్లే పైకెగరాలి తొలకరి జల్లై దిగిరావాలి తారల పొదరింట రాతిరి మజిలీ వేకువ వెనువెంట నేలకు తరలి కొత్త స్వేచ్చకందించాలి నా హృదయాంజలి మానసవీణ మౌన స్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం తూగే వాగు నా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం అలలాగే నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడూ నా సొంతం వాగు నా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం అలలాగే నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడూ నా సొంతం ఊహకు నీవే ఊపిరిపోసి చూపవే దారి ఓ చిరుగాలి కలలకు సైతం సంకెల వేసే కలిమి ఎడారి దాటించాలి తుంటరి తూనీగనై తిరగాలి దోసెడు ఊసులు తీసుకు వెళ్ళి పేద గరిక పూలకు ఇస్తా నా హృదయాంజలి మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే మానసవీణ మౌనస్వరానా జుమ్మని పా...