అరె ఏమైందీ...... అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలింది కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతను నిద్దుర లేపింది అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది అది ఏమైందీ...... నింగి వంగి నేలతోటి నేస్తమేదో కోరింది నేల పొంగి నింగి కోసం పూల దోసిలిచ్చింది పూలు నేను చూడలేదు పూజలేవి చేయలేదు నేలపైన కాళ్ళు లేవు నింగి వైపు చూపు లేదు కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావో కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో అది దోచావో..... బీడులోన వాన చినుకు పిచ్చి మొలక వేసింది పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది గుండె ఒక్కటున్న చాలు గొంతు తానే పాడగలదు మాటలన్ని దాచుకుంటే పాట నీవు రాయగలవు రాత రాని వాడిలాగా దేవుడేమి రాసాడో చేతనైతే మార్చిచూడు వీడు మారిపోతాడు మనిషౌతాడు..... అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలింది కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతను నిద్దుర లేపింది అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది అది ఏమైందీ...... are EmaindI...... are EmaindI oka manasuki rek...