ఆకాశదేశానా ఆషాడమాసానా మెరిసేటి ఓ మేఘమా..మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై (2) ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని కడిమివోలె నిలిచానని ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో విన్నవించు నా చెలికి విన్న వేదనా విరహ వేదనా ఆకాశదేశానా ఆషాడమాసానా మెరిసేటి ఓ మేఘమా..మెరిసేటి ఓ మేఘమా రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై (2) ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని శిధిల జీవినైనాని తొలకరి మెరుపుల లేఖలతో రిధిర భాస్పజల ధారలతో విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతనా ఆకాశదేశానా ఆషాడమాసానా మెరిసేటి ఓ మేఘమా..మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం aakaaSadESaanaa aashaaDamaasaanaa merisETi O mEghamaa..merisETi O mEghamaa virahamO daahamO viDalEni mOhamO vinipinchu naa cheliki mEghasandESam mEghasandESam vaanakaaru kOyilanai tellavaari vennelanai (2) ee eDaari daarulalO eDada nEnu parichaanani kaDimivOle nilichaanani uramani taramani UsulatO ulipiri chinukula baasalatO vinnavinchu ...