దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా (2) జన్మ జన్మకు తోడుగా నా దానివై నువ్వు నడిచిరా దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా మనసులేని శిలను నేను నువ్వు చూసిన నిన్నలో మమత తెలిసి మనిషినైతి చల్లని నీ చేతిలో కన్ను తెరిచిన వేళలో నీకేమి సేవను చేతును దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా మరపు రాదు మాసిపోదు నేను చేసిన ద్రోహము కలన కూడ మరువనమ్మా నువ్వు చూపిన త్యాగము ప్రేమ నేర్పిన పెన్నిధి ఆ ప్రేమ నిను దీవించని దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా జన్మ జన్మకు తోడుగా నా దానివై నువ్వు నడిచిరా దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా Requested by Lahari