నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నా పేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూఉన్నా ల ల ల ల లాయిలే ల ల ల ల లాయిలే ల ల లాయి లాయి ల లాయిలే లాయిలే లాయిలలే నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా హా.. ప్రతి అడుగు తనకుతానే సాగింది నీవైపు నా మాట విననంటు నేనాపలేనంతగా భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చరు హక్కు నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు ల ల ల ల లాయి లాయిలే ల ల ల ల లాయిలే ల ల లాయి లాయి ల లాయిలే లాయిలే లాయిలలే నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా హా.. ఇది వరకు యద లయకు ఏ మాత్రము లేదు హొరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా తడబడకు నను అడుగు చెబుతాను పాఠాలు లేలేత పాదాలు జలపాతమయ్యేట్టుగా నా దారినే మళ్ళించగా నీకెందుకో అంత పంతం మన చేతిలో ఉంటేకదా ప్రేమించటం మాన...