చుక్కల్లో చంద్రుడే చిన్నోడు సూపుల్లో సూర్యుడే సొగ్గాడు ముద్దొస్తూ ఉన్నవే అమ్మాయి మొగించెయిమంటవా సన్నాయి సింగంలా దూకరా మగధీరుడా దమ్మెంతో చూపరా పనివీరుడా మాటల్తో చంపకే ఓ బాలిక వస్తాలే కాసుకో నీ ఓపిక హలో హైసలకిడి బావ నను సోకులతడి కోవా వద్దనక ముద్దులతో మురిపించవా హలో పిట్ట నడుము పిల్లో నీ వాలుచూపు వల్లో నేను మరి తేలికగా పడిపోనల్లా చుక్కల్లో చంద్రుడే చిన్నోడు ముద్దొస్తూ ఉన్నవే అమ్మాయి పాలపొంగు పాప తెగ రూవ్వకే నవ్వు నీలి కళ్ళ చేప వలవెయ్యకే నువ్వు గాలిలాగ వచ్చి నను తాకితే నువ్వు మాయదారి మొహం తొణికించదా నవ్వు ఇద్దరి కథ ఇవ్వాళ్ళే తెంచెయ్యకు విచ్చలవిడి దుకాణం పెట్టెయ్యకు అద్దిరి మన యవ్వారం పెంచెయ్యకు అద్దిరిపడి గుడరాం దించెయ్యకు హలో పిట్ట నడుము పిల్లో నీ వాలుచూపు వల్లో నేను మరి తేలికగా పడిపోనల్లా హలో హైసలకిడి బావ నను సోకులతడి కోవా వద్దనక ముద్దులతో మురిపించయ్యా ముద్దొస్తూ ఉన్నవే అమ్మాయి చుక్కల్లో చంద్రుడే చిన్నోడు టిప్పు టాపు బావ మొహమాటమే లేదు అప్టుడేటుగుంటే డౌటన్నదే రాదు రాలుగాయి పిల్ల చెలగాటమే వద్దు కాలు జారకుండ మనకుందిలే హద్దు కష్టమనకు ఓరయ్యో ఈ పూటకు ఇష్ట సఖిని ఇలాగే జోకొట్టకు కూత పెరగనివ్వాలే...