కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది వేడి పెంచక ఏడిపించక ఏడు పంచి ఊరడించరాదా గోరు వెచ్చగా గోల రెచ్చెగా జోడు కట్టి జోల కొట్టరాదా అయితే పద ఓ సంపద తీర్చేదా నీ బాధ కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది సున్నితాల సొంపులోన కన్నె చూపు జారిపడ్డదే ఓ.. కన్ను దానినాపలేక కన్నెదాని సిగ్గు చెడ్డదే వదిలితే మరి దొరకదే ఈ చోటెంత బాగుంది ఓ.. బెదిరితే కథ కదలదే అని తహ తహ తరుముతున్నదే ఈడాపద తీరేదలా ఏదోటి చెయ్యందే కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది లెక్క చెయ్యమాకు నువ్వు సిగ్గులెంత బుగ్గ నొక్కినా ఓ.. పక్కకెళ్ళి పోకు నువ్వు చుక్కలన్ని నిగ్గి చూసినా అడగనా ఒక బహుమతి నువ్వు చీ పాడు అనకుంటే ఓ.. అడగకే ఎవరనుమతి చెలి తడి తడి పెదవులు అందితే కయ్యానికే తయ్యారయ్యి సయ్యాట సయ్యందే కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది వేడి పెంచక ఏడిపించక ఏడు పంచి ఊరడించరాదా గ...