చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా.. నిన్నే ఆపేదెలా.. చివరికి నువ్వే అలా.. వేస్తావే వలా.. నీతో వేగేదెలా.. ఓ ప్రేమా.. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కలా.. కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది ఆ పై చేదెక్కుతోందిలా.. కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా.. చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా.. నిన్నే ఆపేదెలా.. చివరికి నువ్వే అలా.. వేస్తావే వలా.. నీతో వేగేదెలా.. నిప్పే ఇలా చేరగా మాటే మార్చి మాయే చెయ్యాలా నన్నే ఇక నన్నుగా ప్రేమించని ప్రేమేలా ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండాలా నన్నింతగా ఊరించేస్తూ అల్లేస్తోందే నీ సంకెలా కొంచెం మధురము కొంచెం విరహము ఇంతలో నువ్వు నరకం కొంచెం స్వర్గము కొంచెం శాంతము గొంతులో జారు గరళము కొంచెం పరువము కొంచెం ప్రళయము గుండెనే కోయు గాయము కొంచెం మౌనము కొంచెం గానము ఎందుకీ ఇంధ్రజాలము ఇన్నాళ్ళుగా సాగినా ప్రేమ నుంచి వేరైపోతున్నా మళ్ళీ మరో గుండెతో స్నేహం కోరి వెళుతున్నా ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా ఒకో క్షణం ఆ సంతోషం నాతోపాటు సాగేదెలా ఎలా చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా.. నిన్నే ఆపేదెలా.. చివరికి నువ్వే అలా.. వేస్తావే వలా.. నీతో వేగేదెలా.. ఓ ప్రేమా.. కన్నుల్లో వాలే రోజు ఎంతో ...