మోనా మోనా మోనా మీనాకనుల సోనా నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా సుకుమారా మాటలతో నీ వసమే నేనైతే మహవీరా చూపులతో నా తనువే నీదైతే నా గుండెల్లో మాటేదో త్వరగా నీ చెవి చేరాలి నువ్వాడే సరదాటేదో విన్నర్ నేనే కావాలి మోనా.. మోనా.. మోనా మోనా మోనా మీనాకనుల సోనా నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా హిమమేదో కురియాలి చెక్కిళ్ళు తడవాలి నా కంటి కిరణాలే నిలువెల్లా తాకాలి వనమేదో చెయ్యాలి చిరుగాలి వియ్యాలి వలపేంటో అడిగిందంటూ కౌగిట్లో చేరాలి చలి గిలి చేసెను మోనా తొలిముద్దులకై రానా చలి గిలి చేసెను మోనా తొలిముద్దులకై రానా జరిగేది ఏమైనా జరగాలి కలలాగా ఆనందం అంబరమై నను నేను మరవాల.. మోనా.. మోనా.. మోనా మోనా మోనా మీనాకనుల సోనా నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా జపమేదో చెయ్యాలి హృదయాలు కలవాలి గగనాన తారా తోడై గళము విప్పి పాడాలి జతలన్ని మురియాలి ఒకటైన మనచూసి కథలల్లుకోవాలి ఘనచరితై నిలవాలి భ్రమలే నిజమే అగునా బ్రతుకే నీవనుకోనా భ్రమలే నిజమే అగునా బ్రతుకే నీవనుకోనా చింతేలా ప్రియ భామ నీ చెంత నేలేనా కొంతైనా ఓపిక ఉంటే సొంతం నేకాలేనా మోనా.. మోనా.. మోనా మోనా మోనా మీనాకనుల సోనా నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా సుకుమారా మాటలతో నీ వస...