ఈ జెండ పసి బోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా తన చనుబాలతొ పోరు నేర్పిందిరా ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా ఆ తెల్లొడి గుండెల్ని తొలిచేసిన అమ్మురా వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి నరం ఈ జెండ పసి బోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా శాస్త్రానికి జ్ఞానానికి ఆది గురువురా మన దేశం మానవలికే వైతాలిక గీతం రా భారతం ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం ఆ దైవం మనకోసం సృష్టించే ఈ స్వర్గం ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లిరా తన దేహాన్ని ధైర్యాన్ని పంచిందిరా మనమేమిస్తే తీరేను ఆ రుణమురా ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా భారతీయులుగా పుట్టాము ఈ జన్మకిదిచాలురా వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి నరం ఈ జెండ పసి బోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా పిచ్చి కుక్కలా ఉగ్రవాదమే రెచ్చిపోయి కాటేసినా వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలామురా మంచు మల్...