ఓ చిన్నారి చినుకమ్మా నువ్వు కరిగేది ఎపుడమ్మా ఓ బంగారు చిలకమ్మా నువ్వు ఎగిరేది ఎపుడమ్మా నీళ్ళల్లోని చేపకి కన్నీళ్ళొస్తున్నాయని చెప్పేవారు చూపేవారు ఎవరమ్మా తన తడి తెలియదె తనకైనా ఓ చిన్నారి చినుకమ్మా నువ్వు కరిగేది ఎపుడమ్మా ఓ బంగారు చిలకమ్మా నువ్వు ఎగిరేది ఎపుడమ్మా ఊపిరే ఆవిరై వేగుతున్నదో గుండెలో మబ్బులే కమ్ముకున్నవో తెలిసేదెలా చినుకమ్మకి వాకిట వేకువే వచ్చి ఉన్నదో కాటుకే చీకటై ఆపుతున్నదో తేలేదెలా చిలకమ్మకీ ఈ జన్మ ఖైదెవరు వేసారో నీ వీధి తలుపెవరు మూసారో గాలైన కదపందే తెలిసేనా కనురెప్ప విడకుండ తెలిసేనా మెలకువనె నిదరనుకొనే ఓ చిన్నారి చినుకమ్మా నువ్వు కరిగేది ఎపుడమ్మా ఓ బంగారు చిలకమ్మా నువ్వు ఎగిరేది ఎపుడమ్మా నిత్యము చేదు జ్ఞాపకాలలో హొరునె వింటు ఉన్న జీవితం తేలేదెలా గుండె సవ్వడి నిన్నటి నీడలే నిండి పోయిన చూపులో ఎక్కడ చోటులేనిదే చేరేదెలా రేపులన్నవి నిట్టూర్పులే ఊపిరనుకుంటే మునిమాపులే తూర్పులనుకుంటే ఏ అమృతం జంటకొస్తుంది ఏ నమ్మకం కంటపడుతుంది బ్రతుకంటె గతమనుకొనే ఓ చిన్నారి చినుకమ్మా నువ్వు కరిగేది ఎపుడమ్మా ఓ బంగారు చిలకమ్మా నువ్వు ఎగిరేది ఎపుడమ్మా నీళ్ళల్లోని చేపకి కన్నీళ్ళొస్తున్నాయని చెప్పేవారు చ...