ఎందుకనీ... ఏమిటనీ... బిగిబిగి చెరసాల బిగిసెను ప్రియురాలా చిటపట చిరు జ్వాల కురిసెను హృదయాలా మనసే అవుతోంది మసిబారిన కిరణంలా వలపే మిగిలింది తడి ఆరని నయనంలా అమావాస్యపు గగనంలా ఎందుకనీ... ఏమిటనీ... నీ అడుగులలో అడుగులు వేసి నడిచిన బంధమిదా ఒంటరితనమే క్షణమొక యుగమై మిగిలే ఏమిటిలా ఆరిన పెదవుల మాటలిక నా మాటలిక చేరున చెలి నీ దాకా దాకా దాకా ప్రియతమా నమ్ముమా ప్రాణం ఉన్నది నీకోసం నా కనులలో ఉన్నది నీ రూపం ఎందుకనీ... ఏమిటనీ... వెలుగులు చిలికే చిరు జాబిలిని మబ్బులు కమ్మె ఇలా చిగురులు తొడిగే చిరు నగవులపై చీడే చేరెనెలా చిలిపిగ చేసిన బాసలిలా ఆ బాసలిలా నా మదినే తొలిచేనా తొలిచేనా కాటుకై చేరనా కంటిలో దాగిన కన్నీరై నీ చెక్కిలి తాకన చిరు ఆశై ఎందుకనీ... ఏమిటనీ... బిగిబిగి చెరసాల బిగిసెను ప్రియురాలా చిటపట చిరు జ్వాల కురిసెను హృదయాలా మనసే అవుతోంది మసిబారిన కిరణంలా వలపే మిగిలింది తడి ఆరని నయనంలా అమావాస్యపు గగనంలా ఎందుకనీ... ఏమిటనీ... endukanI... EmiTanI... bigibigi cherasaala bigisenu priyuraalaa chiTapaTa chiru jwaala kurisenu hRdayaalaa manasE avutOndi masibaarina kiraNamlaa valapE migilindi taDi aarani nayanamlaa...