ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి మోవిని మగతావిని ముడివేయనీయవా కాదని అనలేనని గడి అయిన ఆగవా అదుపు పొదుపులేని ఆనందం కావాలి హద్దు పొద్దు లేని ఆరాటం ఆపాలి ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి కాంక్షలో కైపునిప్పు ఎంతగా కాల్చినా దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా వాంచతో వేగు దేహం పరయాగవాటిక కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి నిష్ఠగా నిన్నుకోరి నియమమే దాటినా కష్టమే సేదతీరే నేస్తమే నోచనా నిగ్రహం నీరుగారే జ్వాలలోడించినా నేర్పుగా ఈది చేరే నిశ్చయం మెచ్చనా సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా మదనమే అంతమయ్యే అమృతం అందుకో ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి మోవిని మగతావిని ముడివేయనీయవా కాదని అనలేనని గడి అయిన ఆగవా అదుపు పొదుపులేని ఆనందం కావాలి హద్దు పొద్దు లేని ఆరాటం ఆపాలి ఒంపుల వైఖ...