మనసే గువ్వై ఎగసేనమ్మో చెలి నీ మాటే వినపడగా పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా యద నాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా మంచల్లే కరిగేనే నీ గాలే నా పై వీచగా అయ్యయ్యో ప్రేమే పుట్టెనే అది అడగని ఆశై పట్టెనే నా యదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టెనే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు చెంతకొచ్చి నువు నిలవటం నిన్ను కలిసి నే వెళ్ళటం అనుదినం జరిగెడీ నాటకం ఒక సగాన్ని చెప్పెయ్యటం మరు సగాన్ని దాపెట్టటం తెలిసెలే తెలిసెలే కారణం కాలాలు పూచెలే వేగాలు వేచెలే కలువా నీ కాటుక కన్నుల చూపులు గారడి చేసెలే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు హే నా కంటికి ఏమైనదో రేయంత ఎరుగదు కునుకును ప్రియా నువు లేనిదె నే లేను నా మీద నీ సువాసన ఏనాడు వీచగ కోరెను ఎలా నిను చేరక బ్రతికేను నా ఇరు కల్లకి ఓ హరివిల్లువే నీ విరిసే నవ్వులే యదలో పూల జల్లులే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు...