ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఈ రాయబారాలు సాగే చలిలో ఈ హాయి భారాలు మోసే జతలో ఓ మై లవ్ ఓ మై లవ్.. ఓ మై లవ్ ఓ మై లవ్ (2) కన్నుల్లో ప్రాణంలా చైత్రాలలో నీకోసం వేచాను పూబాలనై వెన్నెల్లో దీపంలా ఓ తారనై నీకోసం నేనున్నా నీవాడినై బాధే కదా ప్రేమంటే... ప్రేమే కదా నీవంటే... ఐనా తీపే తోడుంటే... ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు చీకట్లో నేనుంటే ఓ నీడలా వాకిట్లో నువ్వేగా నా వెన్నెలా కలువల్లే నేనుంటే తేనీటిలో తొలి ముద్దై వాలేవా నా తుమ్మెదా ఏ జన్మదో ఈ ప్రేమా నీ ప్రేమకే ఈ జన్మా నీవే నేనైపోతుంటే... ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఈ రాయబారాలు సాగే చలిలో ఈ హాయి భారాలు మోసే జతలో ఓ మై లవ్ ఓ మై లవ్.. ఓ మై లవ్ ఓ మై లవ్