Skip to main content

Posts

Chakravarthyki Veedi Bicchagatteki from "Money"

చక్రవర్తికీ వీధీ బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ పచ్చ నోటుతో లైఫు లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ పుట్టటానికీ పాడె కట్టటానికి మద్య అంతా తనే అంది మనీ మనీ కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మరీ తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ డబ్బునే లబుడబ్బనే గుండెల్లో పెట్టుకొరా దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా చక్రవర్తికీ వీధీ బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ ఇంటద్దె కట్టావా నా తండ్రి నో ఎంట్రి నీకు వాకిట్లో దొంగల్లే దూరాలి సైలెంట్లి నీ ఇంట్లో చిమ్మ చీకట్లో అందుకే పదా బ్రదర్ మనీ వేటకి అప్పుకే కదా బ్రదర్ ప్రతి పూటకీ రోటీ కపడా రూము అన్నీ రూపీ రూపాలే సొమ్మునే శరనమ్మనే చరనమ్ము నమ్ముకోరా దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా చక్రవర్తికీ వీధీ బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా డ్రీమించుకోవచ్చు ధీమాగ డ్రామాలో ప్రేమ స్టోరీలా పార్కులో కనే కలే ఖరీదైనది బ్లాకుల...

adigadigo aasalu reputu from 'Avakai Biryani'

అదిగదిగో ఆశలు రేపుతూ ఎదురుగా వాలే ఎన్నో వర్ణాలు ఇదిగిదుగో కలలను చూపుతూ యదలను ఏలే ఎవో వైనాలు ఎగిరొచ్చే ఆ గువ్వలా చిగురించే ఈ నవ్వులా సాగే సావాసం ప్రతి హృదయం లో ఆ కల నిజమైతే ఆపేదెలా పొంగే ఆనందం కలైనా ఇదో కధైనా రచించే ఏవో రాగాలే ఈ సమయం ఏ తలపులలో తన గురుతుగ విడిచెలుతుందో ఈ మనసుకు జత ఏదంటే తను ఏమని బదులిస్తుందో వరమనుకో దొరికిన జీవితం రుతువులు గీసే రంగుల ఓ చిత్రం ఈ పయనం ఏ మలుపులో తన గమ్యాన్నే చేరునో చూపే దారేదీ వరించే ప్రతి క్షణాన్ని జయించే స్నేహం తోడవనీ తన గూటిని వెతికే కల్లు గమనించవు యద లోగిళ్ళు తల వాల్చిన మలి సంధ్యల్లో సెలవడిగెను తొలి సందళ్ళు adigadigO ASalu rEputU edurugA vAlE ennO varNaalu idigidugO kalalanu chooputU yadalanu ElE evO vainAlu egirocchE A guvvalA chigurinchE I navvulA saagE saavaasam prati hRdayam lO aa kala nijamaitE aapEdelA pongE Anandam kalainaa idO kadhainaa rachinchE EvO raagaalE I samayam E talapulalO tana gurutuga viDichelutundO I manasuku jata EdanTE tanu Emani badulistundO varamanukO dorikina jeevitam rutuvulu geesE rangula O chitram I payanam E malupulO tana ga...

Akasam Takela from NVNV

ఆకాశం తాకేలా వడ గాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనం లా వినిపించే తడి గానం ప్రేమంటే అణువణువును మీటే మమతల మౌనం పద పద మంటే నిలవదు ప్రాణం ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం దాహం లో మునిగిన చిగురుకు చల్లని తన చెయందించీ స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘం లో నిద్దుర పోఇన రంగులు అన్ని రప్పించి మాఘాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేది ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదఇస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఎమంటే చెప్పేసే మాటుంటే ఆ మాట కి తెలిసేనా ప్రేమంటే అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే దరిదాటి వురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ వొరవడి పెంచిన తొలి చినుకేదంటే సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే పండే పొలము చెపుతుందే పదునుగా నాటే నాగలి పొటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువైవుండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంతా తానై...

Maateraani Chinnadaani from 'O Paapa Laali'

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంట రా (2) వెన్నెలల్లె పూలు విరిసి తేనేలు చిలికెను చెంత చేరి ఆదమరచి ప్రేమలు కొసరెను చందనాల జల్లు కురిసె చూపులు కలిసెను చందమామ పట్ట పగలె నింగిని పొడిచెను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కలలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు వేకువల మేలుకొలుపె నా చెలి పిలుపులు సందె వేళ పలికే నా లో పల్లవి సంతసాల సిరులే నావే అన్నవి ముసి ముసి తలపులు తరగని వలుపులు నా చెలి సొగసులు అన్నీ ఇక నావే మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంట రా మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు mATE rAni chinnadAni kaLLu palikE Usulu andAlanni pallavinchi AlapinchE pATalu prEmE nA...

O Paapa laali from Geetaanjali

ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా ఓ పాప లాలి నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా నీ సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరిక కలలారని పసి పాప తల వాల్చిన వొడిలో తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో చిరు చేపల కనుపాపలకిది నా మనవీ ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాప లాలి ఓ మేఘమా ఉరమకే ఈ పూటకీ గాలిలో తేలిపో వెళ్ళిపో ఓ కోయిలా పాడవే నా పాటని తీయనీ తేనెలే చల్లిపో ఇరు సందెలు కదలాడే యెద ఊయల వొడిలో సెలయేరుల అల పాటే వినిపించని గదిలో చలి ఎండకు సిరివెన్నలకిది నా మనవీ ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా ఓ పాప లాలి O paapa laali janmakE laali prEmakE laali paaDanA teeyagA O paapa laali janmakE laali prEmakE laali paaDanA O paapa laali naa jOlalA leelagA taakaalani gaalinE kOranA jaaligA nee savvaDE sannagA unDaalani kOranA gunDenE kOrika kalalaarani pasi paapa tala vaalchina voDilO taDi neeDalu paDaneekE ee dEvata guDilO chiru chEpala kanupaapalakidi naa manavI O paapa laali...

Emi Cheyamanduve from Priyuraalu Pilichindi

లేదని చెప్ప నిమిషము చాలు లేదనమట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే అదే నేను రుజువే చేయ నూరేళ్ళు చాలవె (2) హృదయమొక అద్దమని నీ రూపు బింబమని తెలిపాను హృదయం నీకు సొంతమనీ బింబాన్ని బంధింప తాడేది లేదు సఖీ అద్దాల ఊయల బింబమూగె చెలీ... నువ్వు తేల్చి చెప్పవే పిల్లా ఎద కాల్చి చంపవే లైలా నా జీవితం నీ కనుపాపలతొ వెంటాడి ఇక వేటాడొద్దే లేదని చెప్ప నిమిషం చాలు లేదనమట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే ఏమి చేయమందువే. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా తెల్లారి పోతున్నా విడిపొని రాత్రేది వాసనలు వీచే నీ కురులె సఖీ లొకాన చీకటైన వెలుగున్నా చోటేది సూరీడు మెచ్చే నీ కనులె చెలీ... విశ్వ సుందరీమణులె వచ్చి నీ పాద పూజ చేస్తారే నా ప్రియ సఖియా ఇక భయమేలా నా మనసెరిగి నా తోడుగ రావే ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే న్యాయమా న్యాయమా.... ఏమి చేయమందువే ఏమి చేయమందువే మౌనమా మౌనమా.... ఏమి...

Jaabilli kosam from Manchi Manasulu

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై (4) నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనడైనా (2) ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలు గా ఊహల్లో తేలీ ఉర్రూతలూగి మేఘాలతొటి రాఘాల లేఖ నీకంపినాను రావా దేవి జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా (2) ఉండీ లేకా వున్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్నా నీ నీడ నాదే నా దన్నదంతా నీవే నీవే జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై (4) నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై jAbilli kOsam AkASamallE vEchAnu nee rAkakai (4) ninu kAnalEka manasUrukOka pADAnu nEnu pATanai jAbilli kOsam AkASamallE vEchAnu nee rAkakai nuvvakkaDa nEnikkaDa pATikkaDa palukakkaDa manasokkaTi kalisunnadi EnaDainA (2) I puvvulanE nee navvulugA I chukkalanE nee kannulugA nun...