Skip to main content

Posts

Emi sodaraaa mansuki from "Tholiprema"

ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా ఒళ్ళు తోమలా పౌడరు పుయ్యలా అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా కళ్ళు తెరుచుకుంటే కలలాయె అవి మూసుకుంటే యద వినదాయె సరికొత్త ఊపు వచ్చి మనసు నిలవదాయే తారురోడ్డే స్టారు హొటలాయె మంచినీళ్ళే ఓల్డ్ మాంకు రమ్మాయే కారు హెడ్ లైట్సే కన్నే కొంటె చూపులాయే పువ్వే నవ్వై హొయలొలికించేస్తుంటే గుండె గువ్వై అరె దూసుకుపోతుంటే లైఫ్ అంతా కైపేలే సోదరా క్లాసు బుక్స్ ఎమ బోరాయే న్యూ తాట్సు డే అండ్ నైటు విడవాయె నిముషాలే యుగములై నిద్దర కరువాయే క్లోజు ఫ్రెండ్సు కనపడరాయె పేరెంట్సు మాట వినపడదాయె పచ్చనోటు కూడ పేపర్ బోట్సైపోయాయే ఏమవుతుందో కనుగొంటే ఒక వింత కాలం చాటే కౌగిట్లో గిలిగింత డూ యు నో వాట్ ఈజ్ దిస్ నేస్తమా ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా ఒళ్ళు తోమలా పౌడరు పుయ్యలా అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా............. 1 Emi sOdarA manasuki EmayindirA oLLu tOmalA pouDaru puyyalA are intalOnE enta DEnjaraipOyarA Emi sOdarA manasuki EmayindirA kaLLu teruchukunTE kalalAye avi mUsukunTE yada vinadAye sarikotta Upu vacchi manasu nilavadAyE tArurODDE sTAru hoTalAye manchinILLE OlD mAnku rammAyE ...

Na gunde gudilo nuvu silavaa from "Villain"

నా గుండె గుడిలో నువు శిలవా దేవతవా నా వలపు బడిలో నువు గురువా శిష్యుడివా (2) నీ కనుల ఒడిలో నే కలనా కాటుకనా నీ పెదవి తడిలో నే ముద్దునా మధురిమనా నీ సొగసు పొగడ నే కవినా కల్పననా నా గుండె గుడిలో నువు శిలవా దేవతవా నా వలపు బడిలో నువు గురువా శిష్యుడివా నే బిడియ పడితే నువు గిలివా చెక్కిలివా నే విరహమైతే నువు రతివా కోరికవా నే పాపనైతే నువు ఒడివా ఊయలవా నే నిదురనైతే నువు కలవా కౌగిలివా నే హృదయమైతే ఊపిరివా సవ్వడివా నా గుండె గుడిలో నువు శిలవా దేవతవా నా వలపు బడిలో నువు గురువా శిష్యుడివా నే గగనమైతే వేసవివా వెన్నెలవా నే నదిని ఐతే నువు అలవా అలజడివా నే విందునైతే నువు రుచివా ఆకలివా నే భాషనైతే నువు స్వరమా అక్షరమా నే పాటనైతే నువు శృతివా పల్లవివా నే.. నే.. నే తోటనైతే ఆమనివా కోయిలవా నే జంటకొస్తే నువు రుషివా మదనుడివా నీ ఎదుట పడితే పిలిచేవా వలచేవా నిను నేను పిలవకుంటే నువు అలగవా అడగవా నన్ను ప్రేమించమంటే తప్పా ఒప్పా నీలోన ఉందీ నేనేకదా నేనేకదా నాలోన ఉందీ నీవే కదా నీవే కదా యదలోని వలపే ఎదురెదురు చూసి వాన లాగా ఒడిచేరెనే naa gunDe guDilO nuvu SilavA dEvatavaa naa valapu baDilO nuvu guruvA SishyuDivaa (2) nee kanula oDilO ...

Udayinchina Suryudinadiga from "Kalusukovaalani"

హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడి నడిగా నువ్వెక్కడని చలి పెంచిన చీకటి నడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడని చిక్కవే ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలి ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి ఇప్పుడూ యెప్పుడు నే మరువ లేని తీపి గురుతులే మనసు అంత నీ రూపం నా ప్రాణమంత నీకోసం నువ్వెక్కడ ఎక్కడ అని వెతికి వయసు అలసిపోయె పాపం నీ జాడ తెలిసి మరు నిమిషం అహ అంతులేని సంతోషం ఈ లోకమంత నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం అడుగు అడుగునా నువ్వే నువ్వే నన్ను తాకేనే నీ చిరునవ్వే కలల నుండి ఓ నిజమై రావే నన్ను చేరవే హోయ్ ప్రేమ పాటకు పల్లవి నువ్వె గుండె చప్పుడికి తాళం నువ్వే యదను మీటి సుస్వరమై రావే నన్ను చేరవే హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా ( || ) నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటోంది నువ్వు లేక వెన్నెల కూడ ఎండల్లె మండుతోంది కాస్త దూరమే కాద మన మధ్యనొచ్చి వాలింది దూరాన్ని తరిమి వేసే గడియ మన దరికి చేరుకోంది ఏమి మాయవో ఎమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని నువ్వు ఉన్న నా మనసంటుంది నిన్ను రమ్మని హోయ్ ను...

Sampangi Remma from "Sampangi"

సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా ఆ నవ్వుల్లోనా ఉన్నాయెన్నో అర్దాలోయమ్మా సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా నిన్ను చూస్తుంటే నా మనసే ఉరకలేస్తుందే ఓ... నీడ తాకుటకై ఒకటే ఆశ పడుతోందే పరిసరి పసనిస నినిపమరిస రిపమప మండుటెండల్లో నీ ఊసే మంచుగా తోచే ఓ.... యదను తాకగనే ఏదో హాయి రగిలేనే చాటుమాటు గా నిన్నే నే చూస్తున్నానే గుండె మాటున నిన్నే పూజిస్తున్నానే ఆ మాటే నీ మదిని చేరే రోజే పండుగలే సంపంగి రెమ్మా.. పూబంతి వమ్మా...... సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా రాత్రి వేళల్లో నీ తలపే జోల పాడేనే ఓ... కలలో నిన్నే చూసి మురిసిపోతానే ఆ ఆ ఆ ఆ ఉదయమే ఐనా మేల్కొన మనసు పడనీదే ఓ... కనులు తెరవగనే కలగా మిగిలిపోదువని ఏకాంతానా నీ ఊహలో జీవిస్తానే ఎన్నేళ్ళైనా నీ కొరకే ఎదురు చూస్తానే నీకోసం ఆ మరణాన్నైనా ప్రేమిస్తానమ్మా సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా sampangi remma pUbanti vamma nacchAvE gummA andAla bomma A manchu chemma navvE chilakammA A navvullOnA unnAyennO ardAlOyammA sampangi remma pUbanti vamma nacchAvE gummA n...

Kotta bangaaru lokam maaku kaavaali from "Donga Donga"

కొత్త బంగారు లోకం..మాకు కావాలి సొంతం.. గాలి పాడాలి గీతం.. పుడమి కావాలి స్వర్గం.. కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం (3) జంట నెలవంకలుండే నింగి కావాలి మాకు వెండి వెన్నెల్లలోనే వెయ్యి కలలు పండాలి మాకు పువ్వులే నోరు తెరిచి మధుర రాగాలు నేర్చి పాటలే పాడుకోవాలి అది చూసి నే పొంగిపోవాలి మనసనే ఒక సంపంద ప్రతి మనిషిలోను ఉండనీ మమతలే ప్రతి మనసులో కొలువుండనీ మనుగడే ఒక పండగై కొనసాగనీ కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం (2) ఓడిపోవాలి స్వార్ధం ఇల మరిచిపోవాలి యుద్ధం మరణమే లేని మానవులే ఈ మహిని నిలవాలి కలకాలం ఆకలే సమసిపోనీ అమృతం పొంగిపోనీ శాంతి శాంతి అను సంగీతం ఇంటింట పాడని ప్రతి నిత్యం వేదనే ఇక తొలగనీ వేడుకే ఇక వెలగనీ ఎల్లలా పోరాటమే ఇక తీరనీ ఎల్లరూ సుఖశాంతితో ఇక బతకనీ కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం (2) kotta bangAru lOkam..maaku kaavaali sontam.. gAli pADAli gItam.. puDami kaavaali swargam.. kotta bangAru lOkam maaku kaavaali sontam gAli pADAli gItam puDami kaavaali swargam (3) janTa nel...

kanulu kanulanu dochaayante from "Donga Donga"

కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్దం నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్దం తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్దం ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్దం అర్దం (2) వాగులే ఉరికితే వయసు కులుకే అని అర్దం కడలియే పొంగితే నిండు పున్నమేనని అర్దం ఈడు పక పక నవ్విందంటే ఊహు అని దానర్దం అందగత్తెకు అమ్మై పుడితే ఊరికత్తని అర్దం అర్దం కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్దం నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్దం తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్దం ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్దం అర్దం కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్దం పడవలే నదులకు బంధుకోటి అని అర్దం చినుకులే వానకు బోసి నవ్వులే అని అర్దం వెల్లవేస్తే చీకటికి అది వేకువవునని అర్దం ఎదిరితే నువ్వు ఎముకలిరిస్తే విజయమని దానర్దం అర్దం అర్దం కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్దం నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్దం తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్దం ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్దం అర్దం (2) kanulu kanulanu dOchAyanTE prEma ani dAnardam ningi kaDalini dOchEnanTE mEGhamani dAnardam tummeda puvvuni dOchindanTE prAyamani dAnard...

Malli Malli idi raani from "Rakshasudu"

Requested by Bhavani మళ్ళి మళ్ళి ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళి మళ్ళి ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు చేరువైన రాయభారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైనా ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం ఎందల్లో వెన్నెల్లొ ఎంచేతో ఒక్కరం ఇద్దరం అవుతున్నా వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గున్నమావి విరబూస్తున్నా తోటమాలి జాడేది నా యదే తుమ్మెదై సన్నిధే చేరగా మళ్ళి మళ్ళి ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు కళ్ళ నిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం దేహమున్నా లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం సందిట్లొ ఈ మొగ్గే పూయని రాగాలే బుగ్గల్లో దాయని గులాబిలు పూయిస్తున్నా తేనెటీగ అతిథేది సందె మబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది రేవులో నావలా నీ జతే కొరగా జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళి మళ్ళి ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు maLLi maLLi idi rAni rOju malli jAji allukunna rOju j...