బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో సందెపొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే వెండిమువ్వల్లే ఘల్లుమంటుంటే గుండె జిల్లుమన్నదే బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో నీలో చింత చిగురు పులుపున్నదే కవ్వంలాగా చిలికే కుళుకున్నదే ఏ.. నీలో చింత చిగురు పులుపున్నదే కవ్వంలాగా చిలికే కుళుకున్నదే కొంటె మాట వెనుక చనువున్నదే తెలుసుకుంటే మనసు పిలుపున్నదే కళ్ళుమూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటుందే ముసుగే లేకుంటే మనసే జగానా వెలుగై నిలిచి ఉంటుందే బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో నిన్న నేడు రేపు ఒక నిచ్చెన మనకు మనకు చెలిమే ఒక వంతెన ఏ.. నిన్న నేడు రేపు ఒక నిచ్చెన మనకు మనకు చెలిమే ఒక వంతెన ఎవరికి వారై ఉంటే ఏముందమ్మా మురళీ కాని వెదురై పోదా జన్మ చేయి చేయి కలిపే కోసమే హృదయం ఇచ్చాడమ్మాయి జారిపోయాక తిరిగి రాదమ్మో కాలం మాయ మరాఠీ బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో సందెపొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే ...