అడుగడుగు గుండెనడుగు తడబడినా ఈడునడుగు
ఏ మంత్రమో వేసావే మనసునే మగతగా కమ్మావే
నీ నవ్వుతో చంపావే వయసునే వరదలా ముంచావే
గుండెలనుండి గుసగుసలేవో వెన్నులో పాకాయిలే
ఊహకురాని తహతహలేవో తాపం పెంచాయిలే
నా నర నరం జివ్వంది తనువుతో అనుభవం అడిగింది
కోరికేదో తొలి మొటిమై పూసే తేనెలాగ చిరుచెమటై పోసే
హాయా ఇది ఎవరి మాయా
సిగ్గు నూనూగు చిగురే వేసే ఉగ్గపట్టి ప్రాణాలే తీసే
తంత్రం చెలి వేసే మంత్రం
చూపు దిగితే చెప్పలేని వయసు కోత ఆ..ఆ.ఆ
వెన్నులోన చిలుకుతున్న తీపి బాధ ఆ..ఆ.ఆ
గుండెలనుండి గుసగుసలేవో వెన్నులో పాకాయిలే
ఊహకురాని తహతహలేవో తాపం పెంచాయిలే
నా నర నరం జివ్వంది తనువుతో అనుభవం అడిగింది
అడుగడుగు గుండెనడుగు తడబడినా ఈడునడుగు
గోరు వెచ్చని ఊపిరికే వేడి కొసల చిరు తాకిడికే
మేను మెరుపులా మెరిసింది ఈడు మెలికలే తిరిగింది
చెలియ తుంటరి నవ్వులకే తలుపు తియ్యని కౌగిలికే
వయసు భగ్గునా మండింది తియ్య తియ్యగా కాల్చింది
చిగురాకులాగ నా ఒళ్ళే సెగ చిమ్మి వణుకుతూ ఉంది
తమకాన్ని రేపే నీ పెదవి నవనాడులాపుతూ ఉంది
నా నర నరం జివ్వంది తనువుతో అనుభవం అడిగింది
అడుగడుగు గుండెనడుగు తడబడినా ఈడునడుగు
గుండెలనుండి గుసగుసలేవో వెన్నులో పాకాయిలే
ఊహకురాని తహతహలేవో తాపం పెంచాయిలే
ఏ మంత్రమో వేసావే మనసునే మగతగా కమ్మావే
నీ నవ్వుతో చంపావే వయసునే వరదలా ముంచావే
Comments
Post a Comment