Skip to main content

పుణ్యభూమి నా దేశం నమో నమామీ

పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ (2)
నన్ను కన్న నా దేశం నమో నమామీ,
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
మహామహుల కన్న తల్లి నా దేశం
మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయదేశం …. నా దేశం
పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ

అదిగో ఛత్రపతీ ధ్వజమెత్తిన ప్రజాపతి
మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే
మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే … ఆఆ..
ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి
మాతృ భూమి నుదిటిపై నెత్తురు తిలకం దిద్దిన మహా వీరుడు సార్వభౌముడు..

అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన..(2)
ఒరెయ్ ఎందుకు కట్టాలి రా శిస్తు…
నారు పోసావా.. నీరు పెట్టావా.. కోత కోసావా కుప్ప నుల్చావా..
ఒరెయ్ తెల్ల కుక్క కష్ట జీవుల ముష్టి తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలి రా..
అని పెల పెల సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి,,
ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒదిగాడు..

పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
నన్ను కన్న నా దేశం నమో నమామీ,
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ

అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి
ఎవడు రా నా భరత జాతిని తత్వమడిగిన తుచ్చుడు
ఎవడు ఎవడాపొగరు బట్టిన తెల్ల దొర గాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి
పన్నులడిగే కొమ్ములొచిన దమ్ములెవడికి వచ్చరా…
బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల తండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా..
అన్న ఆ మన్నెం దొర అల్లూరిని చుట్టు ముట్టి మంది మార్బలమెత్తి
మర ఫిరంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆ ఆకాశం..

ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి..
అఖండ భరత జాతి కన్న మరో శివాజి..
సాయుధ సంగ్రామమే న్యాయమని..
స్వతంత్ర భారతావని మన స్వర్గమని..
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చెయ్యాలని
హిందు ఫౌజు జైహింద్ అని గడిపాడు
గగన సిగలకెగసి కనుమరుగై పోయడు
జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్.. (2)
గాంధీజి కలలు కన్న స్వరాజ్యం..
సాదించే సమరం లో అమర జ్యొతులై వెలిగే
ద్రువతారలు కన్నది ఈ దేశం,,
చరితార్దులకన్నది నా భారత దేశం.. నా దేశం

పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
నన్ను కన్న నా దేశం నమో నమామీ,
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ

Comments

Popular posts from this blog

చిరు చిరు చిరు చినుకై కురిసావే

I'm back :) చిరు చిరు చిరు చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే నువ్వే ప్రేమ బాణం నువ్వే ప్రేమ కోణం పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే యదనే నీతో ఎత్తుకెళ్ళావే చిరు చిరు చిరు చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే దేవతా తనే ఒక దేవత ముఖాముఖి అందమే చూడగా ఆయువే చాలునా గాలిలో తనే కదా పరిమళం చెలి సఖి అనుమతే అడగక పువ్వులే పూయునా సిగలో కురులే మేఘాలల్లే ఆడే వేళ గుండెల్లోన మెరుపే మెరిసే చూపే మైమరచే చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమెయ్యాల చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మది మురిసే యదనే తనతో ఎత్తుకెళ్ళిందే చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే తోడుగా ప్రతీక్షణం వీడకా అనుక్షణం ఆమెతో సాగనా ఆమె నా స్పందన నేలపై పడేయక నీడనే చక చక చేరనా ఆపనా గుండెలో చేర్చనా దారం బదులు ప్రాయంతోటే కట్టేసిందే గాయం లేక కోసేసిందే హాయిగా నవ్వేసిందే నాలో నేను మౌనంగానే మాటాడేస్తే మొత్తం తాను వింటూ ఉందే తియ్యగ వేధిస్తుందే యదనే తనతో ఎత్తుకెళ్ళిందే చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంట...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Snehituda Snehituda from "Sakhi"

నిన్న మునిమాపుల్లో నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ వొళ్ళో గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చెదిరి విలపించా కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో గర్వమనిచెను లే నా గర్వమనిగెను లే స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా... చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం... ఇదే వలపు గెలుపు... శ్వాస తుది వరకూ వెలిగే వేదం వాంచలన్ని వరమైన ప్రాణ బంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్ ఈ జీవితాన పూల పుంత వెయ్యవోయ్ మనసే మధువోయ్ పువ్వు కోసే భక్తుడల్లే మెత్తగా నేను నిద్రపోతే లేత గోళ్ళు గిల్లవోయ్ సందెల్లో తోడువోయ్ ఐదు వేళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి సేవలు సాయవలెరా ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా... చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా నిన్న మునిమాపుల్లో నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ వొళ్ళో గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చెదిరి విలపించా కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో...