ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో (2)
నువ్వు అచ్చుల్లోనా హల్లువో జడకుచ్చుల్లోనా మల్లెవో (2)
కరిమబ్బుల్లోనా విల్లువో మధుమాసం లోనా మంచు పూల జల్లువో
మధుమాసం లోనా మంచు పూల జల్లువో
ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో
ఈ పరిమళము నీదేనా నాలో పరవశము నిజమేనా
బొండు మల్లిపువ్వు కన్నా తేలికగు నీ సోకు
రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు
సొగసుని చూసి పాడగా ఎలా కనులకు మాట రాదుగా అలా
వింతల్లొను కొత్త వింత నువ్వేన ఆ అందం అంటే అచ్చం గాను నువ్వే
ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో (2)
ఆ పరుగులలో పరవళ్ళు తూలే కులుకులలో కొడవళ్ళు
నిన్ను చూసి వంగుతుంది ఆశ పడి ఆకాశం
ఆ మబ్బు చీర పంపుతుంది మోజు పడి నీకోసం
స్వరమున గీతి కోయిలా ఇలా పరుగులు తీయకే అలా అలా
నువ్వు నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం
నీ బుగ్గ సొట్టలో నే పాడే సంగీతం
ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో జడకుచ్చుల్లోనా మల్లెవో (2)
కరిమబ్బుల్లోనా విల్లువో మధుమాసం లోనా మంచు పూల జల్లువో
మధుమాసం లోనా మంచు పూల జల్లువో (2)
Comments
Post a Comment